బాహుబలి సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన ప్రభాస్ ఆ ఇంపాక్ట్ ని సాహో తో కూడా క్యారీ చేశాడు, డిసాస్టర్ టాక్ తో కూడా సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, అన్ని చోట్లా ఎలా ఉన్నా కానీ హిందీ లో మాత్రం అద్బుతమైన లాంగ్ రన్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఆ సినిమా…
అలాంటి సాహో తర్వాత కంప్లీట్ గా లవ్ స్టొరీ తో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ వచ్చేస్తుండగా సినిమా సాధించిన ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో సంచలనం సృష్టించేలా ఉందని చెప్పాలి…
ఏకంగా 200 కోట్లకు పైగా బిజినెస్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ ఇప్పుడు బాహుబలి 2 మరియు సాహో సినిమాల తర్వాత మూడో సారి 200 కోట్లకు పైగా బిజినెస్ ను సొంతం చేసుకుని మూడు బాక్ టు బాక్ 200 కోట్ల బిజినెస్ మూవీస్ తో ఇండియాలో మరే హీరో సృష్టించని రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు.
ఒకసారి టాలీవుడ్ మూవీస్ పరంగా హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించిన సినిమాలను గమనిస్తే…
1. Baahubali2 – 352cr
2. Saaho – 270cr
3. Radhe Shyam – 202.80Cr
4. SyeRaa Narasimha Reddy-187.25Cr
5. Pushpa Part 1: 144.9CR
6. SPYder – 124.8cr+
7. Agnyaathavaasi – 124.6cr
8. Baahubali1 – 118cr
9. Bheemla Nayak – 106.75Cr
10. Maharshi – 100CR
11. BharatAneNenu- 100cr
12. Sarileru Neekevvaru- 99.30Cr
13. Aravindha Sametha- 91cr
14. Vinaya Vidheya Rama – 90cr
15. VakeelSaab – 89.35Cr
ఇప్పుడు టాప్ 3 హైయెస్ట్ బిజినెస్ సాధించిన సినిమాలు ప్రభాస్ పేరిటే ఉండటం విశేషం అని చెప్పాలి. ఇలా రేర్ రికార్డ్ ను నమోదు చేసిన ప్రభాస్ తన అప్ కమింగ్ మూవీస్ తో కూడా ఇదే రేంజ్ లో బిజినెస్ పరంగా సంచలన రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి… ఇక రాధే శ్యామ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.