బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ మూడు వారాలను పూర్తీ చేసుకుని ఇప్పుడు నాలుగో వారంలో అడుగు పెట్టింది. సినిమా మూడో వారం ఎండ్ అయ్యే టైం లో 21వ రోజున సినిమా కి అంబేద్కర్ జయంతి హాలిడే లభించడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రోత్ ని చూపించి మంచి కలెక్షన్స్ ని అన్ని చోట్లా సొంతం చేసుకుంది. కేజిఎఫ్2 నుండి పోటి తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడం విశేషం, తెలుగు రాష్ట్రాలలో 80 లక్షల నుండి 90 లక్షల రేంజ్ లో షేర్ ని రాబట్టవచ్చు అని అంచనా వేయగా సినిమా 21 వ రోజున 96 లక్షల దాకా షేర్ ని సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా 2 కోట్ల రేంజ్ లో…
షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే సినిమా 2.91 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. దాంతో ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ లెక్క 575 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి దుమ్ము లేపింది…
ఒకసారి ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 108.55Cr
👉Ceeded: 49.52Cr
👉UA: 33.83Cr
👉East: 15.60Cr
👉West: 12.80Cr
👉Guntur: 17.61Cr
👉Krishna: 14.17Cr
👉Nellore: 8.99Cr
AP-TG Total:- 261.07CR(393.65CR~ Gross)
👉KA: 42.30Cr
👉Tamilnadu: 37.20Cr
👉Kerala: 10.27Cr
👉Hindi: 120.10Cr
👉ROI: 8.75Cr
👉OS – 96.20Cr
Total WW: 575.89CR(Gross- 1057.00CR~)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 వారాల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క…
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 451 కోట్ల బిజినెస్ కి 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా 3 వారాలు పూర్తీ అయిన తర్వాత మొత్తం మీద బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 122.89 కోట్ల ప్రాఫిట్ తో దూసుకు పోతుంది. ఇక నాలుగో వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…