Home TRP రేటింగ్ 3 ఇయర్స్ ఓల్డ్ DJ కన్నా సాహో కి తక్కువ…షాకింగ్ కన్నడ డబ్బింగ్ TRP రేటింగ్స్!

3 ఇయర్స్ ఓల్డ్ DJ కన్నా సాహో కి తక్కువ…షాకింగ్ కన్నడ డబ్బింగ్ TRP రేటింగ్స్!

468
0

రీసెంట్ గా కన్నడలో తెలుగు నుండి తమిళ్ నుండి చాలా సినిమా లు క్రమం తప్పకుండా డబ్ అవుతూ వస్తున్న విషయం తెలిసిందే, ఈ క్రమం లో రీసెంట్ గా మరో 2 సినిమాలను అక్కడ డబ్ చేసి టెలికాస్ట్ చేయగా రెండు సినిమాలకు కూడా షాకింగ్ రేటింగ్స్ దక్కాయి అనే చెప్పాలి. మూడేళ్ళ క్రితం వచ్చిన అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమా లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రభాస్ సాహో సినిమాలు….

రీసెంట్ గా కన్నడ లో డబ్ అయ్యి టెలికాస్ట్ అయ్యాయి, మరో పక్క అల వైకుంఠ పురం లో టెలికాస్ట్ అయిన టైం కి వేరే ఛానెల్ లో అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమా ను టెలికాస్ట్ చేశారు, దాంతో అటు ఆ సినిమా ఇటు ఈ సినిమా కూడా…

సరైన రేటింగ్స్ ని అందుకోలేదు, దువ్వాడ జగన్నాథం సినిమా కి టెలికాస్ట్ టైం లో 2.23 రేటింగ్ దక్కినట్లు సమాచారం.. ఇక ప్రభాస్ సాహో సినిమా తెలుగు లో టెలికాస్ట్ అయినప్పుడు ఎలా నిరాశ పరిచిందో ఇక్కడ కూడా అదే విధంగా నిరాశ పరిచే రేటింగ్ ని అందుకుంది.

సినిమా కన్నడ డబ్బింగ్ వర్షన్ మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు 2.12 రేటింగ్ ని సొంతం చేసుకుంది, లాస్ట్ ఇయర్ మూవీనే అయినా కానీ మూడేళ్ళ క్రితం వచ్చిన మూవీ కన్నా కూడా తక్కువ రేటింగ్ ని సొంతం చేసుకోవడం ఒకింత షాకింగ్ గా మారింది అనే చెప్పాలి. కానీ సినిమా కంటెంట్ ఫ్యామిలీ సబ్జెక్ట్ కాకపోవడం అండ్ సినిమా రిజల్ట్ కూడా….

ఓవరాల్ గా ఇబ్బంది పెట్టగా తెలుగుతో పాటు కన్నడ లో పెద్దగా ఇంపాక్ట్ చూపలేక పోయింది సాహో సినిమా. కానీ మొత్తం మీద 2 సినిమాల రేటింగ్స్ లో దువ్వాడ జగన్నాథం జోరు చూపగా సాహో నిరాశ పరిచింది, అదే టైం లో దువ్వాడ జగన్నాథం టెలికాస్ట్ వలన అల వైకుంఠ పురం లో రేటింగ్ కి కొంచం దెబ్బ పడింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here