Home గాసిప్స్ 3 ఏళ్ళుగా హిట్ లేదు….ఏకంగా సూపర్ స్టార్ బ్యానర్ లో…!!

3 ఏళ్ళుగా హిట్ లేదు….ఏకంగా సూపర్ స్టార్ బ్యానర్ లో…!!

661
0

టాలీవుడ్ టైర్ 2 హీరోల్లో చాలా కష్టపడి పైకి వచ్చిన వారిలో శర్వానంద్ కూడా ఒకరు. కెరీర్ ని సైడ్ రోల్స్ తో మొదలు పెట్టి అంచలంచలుగా ఎదిగి సోలో హీరోగా మారి మంచి విజయాలను అందుకున్న శర్వానంద్ కెరీర్ పీక్ టైం ని 2017 లో ఎంజాయ్ చేశాడు. శతమానం భవతి తన కెరీర్ బెస్ట్ హిట్ గా నిలవగా తర్వాత చేసిన రాధా ఫ్లాఫ్ అయినా దసరా కి మహాను భావుడు సినిమా తో మరో హిట్ ని…

తన ఖాతాలో వేసుకుని దూసుకు పోతున్న టైం లో తర్వాత చేసిన సినిమాలు అన్నీ ఫ్లాఫ్ అవ్వడం తో తన మార్కెట్ పై భారీ ఇంపాక్ట్ ని చూపింది. పడి పడి లేచే మనసు, రణరంగం మరియు తమిళ్ బ్లాక్ బస్టర్….

96 తెలుగు రీమేక్ జాను కూడా భారీ డిసాస్టర్ అవ్వగా ఇప్పుడు తన ఆశలన్నీ అప్ కమింగ్ మూవీ శ్రీకారం మీదే పెట్టుకున్న శర్వానంద్ అప్ కమింగ్ మూవీ ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యానర్ లో ఆల్ మోస్ట్ కన్ఫాం అయినట్లే అని లేటెస్ట్ గా వార్తలు గట్టిగానే శిఖారు చేస్తున్నాయి.

తన హోమ్ బ్యానర్ ని శ్రీమంతుడు తో లాంచ్ చేసిన మహేష్ తర్వాత తన సినిమాలకు తను కూడా ఒక నిర్మాతగా వ్యవహరించడం మొదలు పెట్టాడు. ఇక తనే కాక తన బ్యానర్ లో వేరే హీరోలతో కూడా సినిమా చేయడం అడవి శేష్ తో మేజర్ సినిమా నిర్మిస్తుండటం అందరికీ తెలిసిందే. ఇక ఈ బ్యానర్ లో…

తన అప్ కమింగ్ మూవీ కి గాను శర్వానంద్ ని హీరోగా సెలెక్ట్ చేసుకున్నారని తెలుస్తుంది. దాంతో శర్వానంద్ కెరీర్ కి ఇది బాగా ఉపయోగ పడే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. సినిమా కి సంభందించిన మరిన్ని విశేషాలు త్వరలోనే రివీల్ అవుతాయని అంటున్నారు. మరి శర్వానంద్ తన అప్ కమింగ్ మూవీస్ తో అయినా మళ్ళీ ఫాం అందుకుంటాడో లేదో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here