నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డాయి…. 2018 టైం లో జై సింహా సినిమా తో హిట్ కొట్టిన తర్వాత బాలయ్య భారీ బడ్జెట్ తో నిర్మాతగా మారి నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బిజినెస్ ను చేసినా ఆడియన్స్ నుండి రెస్పాన్స్ మాత్రం తీవ్రంగా నెగటివ్ గా రావడం తో హిట్ టాక్ తో కూడా…
ఎన్టీఆర్ కథానాయకుడు టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక నష్టాలు సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది, తర్వాత ఆ నష్టాలను పూడ్చడానికి ఫ్రీగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ మహానాయకుడు అంతకుమించిన డిసాస్టర్ రిజల్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోగా… అదే ఇయర్ ఎండ్ టైం కి….
తనకి జై సింహాతో హిట్ ఇచ్చిన కే ఎస్ రవికుమార్ తో చేసిన రూలర్ సినిమా మరో ఊహకందని డిసాస్టర్ అవ్వడంతో బాలయ్య పని ఇక అయిపోయినట్లేనని అనుకున్నారు అందరూ… కొత్త సినిమా ఒప్పుకోవడానికి కూడా టైం తీసుకుంటున్న టైం లో బాలయ్య కంబ్యాక్ ఎలా ఉంటుందో అన్న అనుమానాల నడుమ….
అదే టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకున్న బోయపాటితో కలిసి బాలయ్య సింహా లెజెండ్ ల తర్వాత హాట్రిక్ మూవీగా అఖండని ఒప్పుకున్నా ఈ సారి వీళ్ళ కాంబో వర్కౌట్ అవుతుందో లేదో అన్న డౌట్స్ నడుమ అఖండ మొదలు అవ్వగా ఫస్ట్ టీసర్ నుండి అంచనాలను పెంచిన సినిమా అఖండ లుక్ వచ్చిన తర్వాత అంచనాలు పీక్స్ కి వెళ్ళాయి.
ట్రైలర్ రిలీజ్ తో మరింత రచ్చ చేసిన అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన 8 రోజుల్లో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని ఇప్పుడు బాలయ్య కెరీర్ లో నంబర్ 1 షేర్ వసూల్ చేసే సినిమాగా నిలవబోతుంది. కంబ్యాక్ అంటే ఈ రేంజ్ లో ఉండాలి అనిపించే లెవల్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర అఖండ సినిమా ఊచకోత కోస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.