టెలివిజన్ యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయం అయిన లేటెస్ట్ మూవీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. మొదటి రోజు నుండే సినిమా అంచనాలను మించి కలెక్షన్స్ ని దక్కించుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమంత పాజిటివ్ టాక్ కూడా సొంతం చేసుకోకుండానే సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం.
సినిమా చూసిన వారు అందరూ కొందరు బాగుందని, కొందరు యావరేజ్ అంటూ మిక్సుడ్ టాక్ ని చెప్పగా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అవేవి ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపలేక పోయాయి. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లోనే ఆల్ మోస్ట్ బిజినెస్ ను అందుకుని…
సంచలనం సృష్టించగా 4 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు మరో వర్కింగ్ డే టెస్టులో కూడా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద ఇప్పుడు 5 రోజుల్లో..
వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ తో 10 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించింది. చిన్న సినిమా, అందునా టెలివిజన్ యాంకర్ హీరోగా పరిచయం అయిన సినిమా, అందులో కూడా మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవ్వడం అండ్ తర్వాత 10 కోట్ల మైలురాయిని అందుకోవడం అన్నది మామూలు అచీవ్ మెంట్ కాదనే చెప్పాలి.
సినిమా ఇంతటి విజయాన్ని నమోదు చేయడానికి ఒక్క సాంగ్ సినిమా పై పెంచిన క్రేజ్ అండ్ ప్రదీప్ టెలివిజన్ ఫేం కూడా కారణాలు అని చెప్పాలి. మొత్తం మీద మొదటి వారంలోనే ఇప్పుడు సూపర్ హిట్ అనిపించుకోబోతున్న ఈ సినిమా సెకెండ్ వీకెండ్ హోల్డ్ చేస్తే బ్లాక్ బస్టర్ రిజల్ట్ తో పరుగును ముగించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…