బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ నాలుగు వారాలను పూర్తీ చేసుకుని 5వ వారంలో అడుగు పెట్టగా సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ జోరుని మరోసారి కొనసాగించి బాక్స్ ఆఫీస్ దగ్గర 30 వ రోజు వీకెండ్ స్టార్ట్ అవ్వడంతో మరోసారి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేసింది. సినిమా 30 వ రోజు తెలుగు రాష్ట్రాలలో ఎక్స్ లెంట్ గ్రోత్ ని చూపించింది అని చెప్పాలి.
40 లక్షల రేంజ్ లో షేర్ కన్ఫాం అనుకుంటే సినిమా అనుకున్నట్లు గానే 43 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేయగా…
అనుకున్నట్లు గానే సినిమా 30 వ రోజు వరల్డ్ వైడ్ గా 1.55 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా గ్రాస్ 3.20 కోట్ల మార్క్ ని అందుకుని సూపర్ సాలిడ్ హోల్డ్ ని చూపించింది. ఇక మొత్తం మీద సినిమా 30 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
👉Nizam: 110.31Cr
👉Ceeded: 50.36Cr
👉UA: 34.46Cr
👉East: 15.95Cr
👉West: 13.04Cr
👉Guntur: 17.89Cr
👉Krishna: 14.42Cr
👉Nellore: 9.19Cr
AP-TG Total:- 265.62CR(401.30CR~ Gross)
👉KA: 43.15Cr
👉Tamilnadu: 37.79Cr
👉Kerala: 10.41Cr
👉Hindi: 129.35Cr
👉ROI: 9.08Cr
👉OS – 100.10Cr
Total WW: 595.50CR(Gross- 1103.50CR~)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 30 రోజుల్లో సాధించిన కలెక్షన్స్…
మొత్తం మీద సినిమా 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో మొత్తం మీద 142.50 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ నుండి ఇప్పుడు ఆల్ మోస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకునే రేంజ్ లో ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంది. ఇక 31వ రోజు ఆదివారం అవ్వడంతో మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.