వి ది మూవీ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత తెలుగు సినిమాల డిజిటల్ రిలీజ్ లకు చాలా సినిమాలు సిద్ధం అయినప్పటికీ OTT యాప్స్ టోటల్ గేమ్ చేంజ్ చేసి అన్ని సినిమాలకు ఇప్పుడున్న క్రేజ్ ప్రకారం రేట్లు డిసైడ్ చేయడం మొదలు పెట్టాయి. ఒకటి రెండు సినిమాలకు రేట్లు పెంచినప్పటికీ చాలా సినిమాలకు మాత్రం ముందు అనుకున్న రేట్లు ఇప్పుడు చాలా వరకు తగ్గుముఖం పట్టడం అందరికీ షాక్ ఇస్తుంది.
ఈ ఇంపాక్ట్ చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమలకూ ఇంపాక్ట్ చూపగా వాటిలో యాంకర్ ప్రదీప్ నటించిన సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కూడా ఒకటి, సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వల్ల ఆగిపోగా…
అప్పట్లో సినిమా డిజిటల్ రిలీజ్ చేస్తే 6.5 కోట్ల రేంజ్ రేటు ఇవ్వడానికి కూడా సిద్దం అయ్యారు. సినిమా బడ్జెట్ 4.5 కోట్ల రేంజ్ లో ఉండగా ఆ రేటు కి 2 కోట్లు అధికంగా రేటు ఆఫర్ వచ్చినా యూనిట్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారి పోగా ఆ రేట్లు కూడా మారిపోయాయి…
ఇప్పుడు యూనిట్ మంచి OTT ఆఫర్ కోసం ఎదురు చూస్తుండగా డైరెక్ట్ రిలీజ్ కోసం OTT యాప్స్ ఇస్తున్న రేట్లు చాలా తగ్గాయట. ముందు 6.5 కోట్ల రేంజ్ లో ఉన్న రేటు ఇప్పుడు సగానికి పైగా తగ్గి 3 కోట్ల నుండి 3.2 కోట్ల రేంజ్ లో డీల్ కి మేం సిద్ధం అన్నట్లు చెబుతున్నారట. దాంతో ముందు రేటు కి ఇప్పటి రేటు కి…
ఇంత డిఫెరెన్స్ చూసి యూనిట్ ఒకింత షాక్ అయ్యారట. కానీ ఇప్పుడున్న మార్కెట్ దృశ్యా ఇవే ఫైనల్ అన్నట్లు చెబుతున్నారట. రీసెంట్ గా రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా కూడా ముందు 7 కోట్లకు పైగా రేటు వచ్చినా నో చెప్పి 4 కోట్లకు ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ఈ సినిమా విషయం లో కూడా ఆల్ మోస్ట్ ఇదే జరుగుతుందని చెప్పొచ్చు. యూనిట్ నిర్ణయం మాత్రం ఇంకా కన్ఫాం అవ్వాల్సి ఉందట….