పాపులర్ టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా అమృతా అయ్యర్ హీరోయిన్ గా రూపొందిన సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా… ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా వలన పోస్ట్ పోన్ అవ్వగా అంతకుముందే రిలీజ్ అయిన నీలి నీలి ఆకాశం సాంగ్ హ్యుమంగస్ హిట్ తో ఆడియన్స్ లో మంచి బజ్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి.
అప్పటి నుండి సినిమా వరుసగా పోస్ట్ పోన్ లు అవుతూ డిజిటల్ రిలీజ్ ఆఫర్లు వస్తున్నా నో చెబుతూ వచ్చినా కానీ ఈ పాట వలన వార్తల్లో నిలిచిన ఈ సినిమా ఎట్టకేలకు ఇప్పుడు ఆడియన్స్ ముందుకు జనవరి 29 న రానుండగా సినిమా సాదించిన ఓవరాల్…
ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తుంది, సినిమాను యు వి క్రియేషన్స్ అండ్ గీతా ఆర్ట్స్ 2 కలిసి తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తూ ఉండగా సాలిడ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా.. ఒకసారి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ప్రీ రిలీజ్ బిజినెస్ ను గమనిస్తే…
సినిమా నైజాం ఏరియాలో 1.5 కోట్ల బిజినెస్ ను, సీడెడ్ లో 55 లక్షల బిజినెస్ ను, ఆంధ్రాలో 2.1 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు సినిమా ఏకంగా 4.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 4.4 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే…
మినిమమ్ 4.8 కోట్ల రేంజ్ షేర్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకోవాల్సి ఉంటుంది, ఈ రేంజ్ బిజినెస్ ను ఒక్క సాంగ్ హిట్ తో సొంతం చేసుకోవడం అంటే మాములు విషయం కాదు, మరి సినిమా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది, ఈ బిజినెస్ ను రికవరీ చేస్తుందో లేదో చూడాలి ఇక…