Home న్యూస్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా…రివ్యూ… ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

30 రోజుల్లో ప్రేమించడం ఎలా…రివ్యూ… ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

టెలివిజన్ పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయం అవుతున్న మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ కరోనా వలన పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఒక్క సాంగ్ తో అద్బుతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చాకా ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే…1947 టైం లో హీరో హీరోయిన్స్ ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోకుండా చనిపోవాల్సి వస్తుంది… తిరిగి వాళ్ళు ప్రజెంట్ టైం లో పుట్టడం జరుగుతుంది, ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు, మరి అలాంటి వాళ్ళు ఎలా ప్రేమించుకున్నారు, వాళ్లకి పూర్వజన్మ గురించి…

ఎలా తెలిసింది, తెలిశాక ఎం జరిగింది అన్నది మొత్తం మీద సినిమా కథ… ఈ కథని మనం ఆల్ రెడీ చాలా సినిమాల్లో చూశాం, ఇక్కడ కూడా ఇదే సింపుల్ కథ… కానీ పెర్ఫార్మెన్స్ పరంగా 1947 టైం కి గాను ప్రదీప్ అదరగొట్టే పెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు.

ఆ రోల్ చిన్నదే అయినా తన పెర్ఫార్మెన్స్ మనకు గుర్తుండి పోతుంది… ఇక ప్రజెంట్ టైం లో కూడా తన కామెడీ టీవీ లలో మనం చూసినట్లుగానే చాలా సింపుల్ గా నటిస్తూ వెళ్ళిపోయాడు ప్రదీప్… అది కొందరికి నచ్చుతుంది, కొందరికి సింపుల్ గా అనిపిస్తుంది.

ఇక హీరోయిన్ అమృతా అయ్యర్ రెండు డిఫెరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించింది, సెకెండ్ ఆఫ్ గ్లామర్ తో మెప్పించింది. తనకి ఈ సినిమా తెలుగు లో మంచి ఆఫర్స్ తెప్పించడం ఖాయం. ఇక మిగిలిన రోల్స్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఉన్నంతలో మెప్పించారు.

ఇక సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం అండ్ సోల్ ఫుల్ బ్యాగ్రౌండ్ స్కోర్, ఇనీషియల్ ఎపిసోడ్ మొత్తాన్ని తన మ్యూజిక్ తో ఆడియన్స్ లో అద్బుతమైన పాజిటివ్ ఇంప్రెషన్ ని క్రియేట్ చేశాడు అనూప్, తర్వాత బ్యాగ్రౌండ్ స్కోర్ తో కూడా వీక్ అనిపించినా ప్రతీ సీన్ లో కూడా…

తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో మ్యానేజ్ చేశాడు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉంది, కథ ప్రిడిక్ట్ చేసేలానే ఉండటం తో ఇక్కడ లెంత్ తగ్గించాల్సింది కానీ ఎక్కువ సీన్స్ కట్ చేయలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ అద్బుతంగా ఉంది. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే…

మున్నా ఆల్ రెడీ మనకు తెలిసిన కథనే డిఫెరెంట్ గా చెప్పాలని ట్రై చేశాడు. ఇలాంటి సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఒకేసారి వస్తుంది, కానీ ఇందులో అలా కాకుండా ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ చెప్పి తర్వాత సెకెండ్ ఆఫ్ లో మరో సారి ఫ్లాష్ బ్యాక్ తో సింక్ చేశాడు. అది కొంచం లేట్ అయ్యింది అనిపిస్తుంది.

ఫస్ట్ ఓపెన్ అవ్వడం పూర్వజన్మతో ఓపెన్ అవ్వడంతో మంచి ఎపిసోడ్ అండ్ సాంగ్ తో సినిమాపై మంచి ఇంప్రెషన్ వస్తుంది, తర్వాత ప్రజెంట్ టైం కి రావడం తో హీరో హీరోయిన్ గిల్లికజ్జాలు, కాలేజ్ ఎపిసోడ్ లు ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి కానీ అవి మరీ అంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేయవు…

అలా అని బోర్ కొట్టవు, మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడగా ఫస్టాఫ్ బాగుంది అనిపిస్తుంది, ఇక సెకెండ్ ఆఫ్ స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అయినా తర్వాత సీన్స్ రిపీటివ్ గా అనిపించడం కొంచం బోర్ ఫీల్ అవ్వడం జరుగుతుంది, ఇక ఒక మంచి ట్విస్ట్ అండ్ తర్వాత సెంటి మెంట్ సీన్ తో క్లైమాక్స్ రొటీన్ గానే ఉన్నప్పటికీ…

మెప్పించే విధంగా సినిమా ముగుస్తుంది. మొత్తం మీద సినిమా మరీ కొత్తదనం కోరుకునే వాళ్ళకోసం తీసిన సినిమా కాదు. రొటీన్ కమర్షియల్ మూవీనే ఇష్టపడే వారికీ యూత్ లవ్ స్టొరీ ని యాడ్ చేసి కొంచం కామెడీ తో మెప్పించే ప్రయత్నం చేశారు. దానికి పూర్వజన్మల కాన్సెప్ట్ కొంచం కలిసి వచ్చింది.

రొటీన్ గానే ఉన్నా సినిమా లో అలరించే అంశాలు ఉండటం కలిసి వచ్చింది, యూత్ ని మెప్పించే అవకాశం ఎక్కువగా ఉండగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆకట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది, కానీ కొత్త కథలు కోరుకునే వారికి సినిమా ఎక్కే అవకాశం తక్కువ… సో సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here