బాక్స్ అఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాను కొనడానికి అందరూ ఎగబడటం అన్నది కామన్, సినిమా రిజల్ట్ మీద నమ్మకం ఉంటే రిలీజ్ కే ముందే అమ్ముడు పోయే డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ను ఆపేసి సినిమా హిట్ అయిన తర్వాత మంచి హిట్ అయితే అప్పుడు…
ఎక్కువ రేటు వస్తుంది అన్న ఆశతో అప్పుడప్పుడు నిర్మాతలు నాన్ థియేట్రికల్ రైట్స్ ను హోల్డ్ లో పెడతారు. చాలా సార్లు ఇది వర్కౌట్ అవుతుంది కానీ కొన్ని సార్లు వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఇలాంటిదే రిపీట్ అవుతుంది…. రీసెంట్ టైంలో బాలీవుడ్ లో…
అంచనాలను మించి హిట్ గా నిలిచిన సినిమా ది కేరళ స్టొరీ(The Kerala Story), కాంట్రవర్సీలనే నమ్ముకుని ఆడియన్స్ లో బజ్ ను క్రియేట్ చేసిన ఈ సినిమాను థియేటర్స్ లో చూడటానికి జనాలు ఎగబడటంతో ఏకంగా టోటల్ రన్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
302 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకున్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ను కూడా రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ ను బట్టి భారీ రేటుకు అమ్ముకోవచ్చు అనుకున్నా కూడా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యాక కూడా నాన్ థియేట్రికల్ రైట్స్ ను….
కొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదని తెలుస్తుంది… మేకర్స్ అనుకునే రేటుకి వస్తున్న ఆఫర్స్ కి చాలా తేడా ఉండటంతో ఎవ్వరూ ఆ రేటు పెట్టు కొనడానికి ముందుకు రావడం లేదట. దాంతో సినిమా డిజిటల్ లో టెలివిజన్ లో రావడానికి కొంత టైం పట్టేలా ఉందని చెప్పాలి ఇప్పుడు.
Syndicate saami