Home న్యూస్ 3 డేస్…30**…మాస్ జాతర ఇది!!

3 డేస్…30**…మాస్ జాతర ఇది!!

2342
0

బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రెండు రోజుల్లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడో రోజు లో ఎంటర్ అవ్వగా మూడో రోజు కూడా ఆదివారం అవ్వడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుండి అవలీలగా 6.5 కోట్ల నుండి 7 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని…

అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా ఫైనల్ లెక్కలు అన్నీ అనుకూలంగా ఉంటే 7.5 కోట్ల మార్క్ ని కూడా అందుకునే అవకాశం ఉంది, ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ కలెక్షన్స్ అన్నీ కలిపి 7.5 కోట్ల నుండి 8 కోట్ల రేంజ్ లో వసూళ్ళ ని సినిమా అందుకునే అవకాశం ఉండగా…

ఫైనల్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ మరికొంత ముందుకు వెళ్ళే అవకాశం ఉండగా అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా ఇప్పుడు మూడు రోజుల వీకెండ్ లో 29 కోట్ల నుండి 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here