Home గాసిప్స్ 30 కోట్లతో 111 కోట్లు…తెలుగు రీమేక్ బడ్జెట్ ఏంతంటే?

30 కోట్లతో 111 కోట్లు…తెలుగు రీమేక్ బడ్జెట్ ఏంతంటే?

858
0

యూత్ స్టార్ నితిన్ భీష్మ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేయగా ఇప్పుడు రంగ్ దే సినిమా తో ఆడియన్స్ ముందుకు డైరెక్ట్ డిజిటల్ ద్వారా లేదా థియేటర్స్ లో వచ్చే అవకాశం ఉండగా ఈ సినిమా తర్వాత నితిన్ చేస్తున్న అప్ కమింగ్ మూవీ బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధధూన్ సినిమా తెలుగు రీమేక్ అన్న విషయం అందరికీ తెలిసిందే. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్…

ఎక్స్ ప్రెస్ రాజా మరియు కృష్ణార్జున యుద్ధం సినిమాల డైరెక్టర్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ రీమేక్ లో హీరోయిన్స్ రీసెంట్ గా కన్ఫాం అయ్యారు.. హిందీ లో మెప్పించిన తబు రోల్ కి తెలుగు లో చాలా మందిని అనుకున్నారు కానీ అందరికీ షాక్ ఇస్తూ…

తమన్నా ఆ రోల్ కి సెలెక్ట్ అవ్వగా రాధిక ఆప్టే రోల్ కి ముందే నబా నటేష్ సెలెక్ట్ అయ్యింది. ఇక సినిమా తెలుగు లో భారీ బడ్జెట్ తో స్టైలిష్ మేకింగ్ తో రూపొందబోతుందని సమాచారం. హిందీ లో ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధధూన్ సినిమాను 30 కోట్ల రేంజ్…

బడ్జెట్ తో రూపొందించగా సినిమా ఇండియా లో 72 కోట్ల నెట్ కలెక్షన్స్ ని, టోటల్ వరల్డ్ వైడ్ గా 111 కోట్ల కలెక్షన్స్ ని అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది, కానీ తెలుగు వర్షన్ ని ఇప్పుడు ఏకంగా 40 కోట్ల రేంజ్ బడ్జెట్ తో భారీ లెవల్ లో రూపొందించబోతున్నారు అన్నది లేటెస్ట్ టాలీవుడ్ టాక్. అక్కడ 30 కోట్ల రేంజ్ బడ్జెట్ తోనే అద్బుతమైన క్వాలిటీ తో వచ్చిన సినిమా…

కన్నా కూడా తెలుగు లో మరింత స్టైలిష్ గా సినిమా ఉంటుందని అంటున్నారు. నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమా ను కుదిరితే వచ్చే ఇయర్ సమ్మర్ లో లేదా సెకెండ్ ఆఫ్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. భీష్మ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన నితిన్ మరోసారి ఈ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here