బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా వరకు ఏ సినిమా అయినా ఇండియా కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, ఓవర్సీస్ కలెక్షన్స్ తక్కువగా ఉంటాయి. కానీ కొన్ని కొన్ని సినిమాలు మాత్రం ఇక్కడ కలెక్షన్స్ కి ఏమాత్రం తీసి పోనీ విధంగా ఓవర్సీస్ వసూళ్లు వస్తూ ఉంటాయి..
చాలా వరకు తమిళ్ సినిమాలకు ఓవర్సీస్ కలెక్షన్స్ ఇలా హెల్ప్ అవుతూ ఉంటాయి, హిందీ సినిమాల్లో కొన్ని సినిమాలకు ఇది హెల్ప్ అవ్వగా ఇప్పుడు లేటెస్ట్ గా మిక్సుడ్ రెస్పాన్స్ సొంతంక్ చేసుకున్న ఒక సినిమా కలెక్షన్స్ పరంగా ఓవర్సీస్ కలెక్షన్స్ హెల్ప్ తో…
ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది. ఆ సినిమానే…. కరణ్ జోహార్ డైరెక్షన్ లో రణవీర్ సింగ్ – ఆలియా భట్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Kii Prem Kahaani) సినిమా…
ఆడియన్స్ ముందుకు నెల రోజుల ముందు వచ్చిన ఈ సినిమా మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం కుమ్మేసింది. ఇండియాలో ఈ సినిమా ఆల్ మోస్ట్ 150 కోట్ల లోపు నెట్ కలెక్షన్స్ ని అందుకోగా గ్రాస్ 177 కోట్ల దాకా ఉంది..
కానీ ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పటి వరకు 159 కోట్ల దాకా గ్రాస్ ను వసూల్ చేసింది. ఓవర్సీస్ లో కరణ్ జోహార్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి కలెక్షన్స్ అక్కడ నుండి ఓ రేంజ్ లో సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పటి వరకు 336 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని మంచి హిట్ గా నిలిచింది.