నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 5 వ వారంలో ఎంటర్ అయినా ఇప్పటికీ సాలిడ్ కలెక్షన్స్ ని సాధిస్తూ ఉండగా సినిమా 30 వ రోజు 10 లక్షల షేర్ ని అందుకుంటే 31 వ రోజు న్యూ ఇయర్ రావాడంతో రెట్టించిన జోరు చూపెట్టిన అఖండ ఆల్ మోస్ట్ 5 రేట్ల కన్నా ఎక్కువ వసూళ్ళని 31 వ రోజు సొంతం చేసుకుంది. నైజాంలో 26 లక్షలు, సీడెడ్ లో 19 లక్షలు టోటల్ ఆంధ్రలో 15 లక్షల దాకా…
షేర్ ని సొంతం చేసుకున్న అఖండ సినిమా మొత్తం మీద 31 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 60 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. తక్కువ థియేటర్స్ లో ఈ రేంజ్ షేర్ ని 31 వ రోజు సొంతం చేసుకోవడం అంటే మాములు మాస్ కాదు.
సినిమా టోటల్ 31 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 20.20Cr
👉Ceeded: 15.27Cr
👉UA: 6.16Cr
👉East: 4.14Cr
👉West: 4.10Cr
👉Guntur: 4.69Cr
👉Krishna: 3.58Cr
👉Nellore: 2.60Cr
AP-TG Total:- 60.74CR(101CR~ Gross)
Ka+ROI: 5.01Cr
OS – 5.68Cr
Total WW: 71.43CR(125.60CR~ Gross)
ఇదీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 31 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ జాతర. సినిమా 31 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో కొన్ని మైల్ స్టోన్ మార్క్స్ ని కూడా అందుకోవడం విశేషం అని చెప్పాలి. సినిమా నైజాం ఏరియాలో 20 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా బాలయ్య కెరీర్ లో ఇది ఫస్ట్ 20 కోట్ల షేర్, ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 101 కోట్ల గ్రాస్ మార్క్ ని…
సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. బాలయ్య కెరీర్ లో ఇది ఆల్ టైం రికార్డ్ అని చెప్పాలి. ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను లాంగ్ రన్ లో కూడా షేక్ చేస్తున్న అఖండ 54 కోట్ల టార్గెట్ కి 17.43 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. సినిమా ఊపు చూస్తుంటే సంక్రాంతి వరకు కలెక్షన్స్ రావడం ఖాయంగా కనిపిస్తుంది.