బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వారాలను పూర్తీ చేసుకుని 5వ వారంలో అడుగు పెట్టిన మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా ఆల్ రెడీ మెగాస్టార్ కెరీర్ లో హైయెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచి ఊచకోత కోయగా సినిమా మెగాస్టార్ కెరీర్ లో సెకెండ్ హైయెస్ట్ కలెక్షన్స్ ని కూడా వసూల్ చేసి సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు 5వ వీకెండ్ లో అడుగు పెట్టి…
కొత్త సినిమాల కోసం మరిన్ని థియేటర్స్ ని కోల్పోయినా కానీ కొన్ని చోట్లా ఇప్పటికీ సినిమాకి మంచి డిమాండ్ ఉండటంతో 31 వ రోజు ఆదివారం రోజున తిరిగి షోలను కూడా పెంచుకున్న వాల్తేరు వీరయ్య సినిమా ఆంధ్రలో అలాగే సీడెడ్ ఏరియాలో పలుచోట్ల థియేటర్స్ లో…
ఏకంగా హౌస్ ఫుల్ బోర్డులను 31వ రోజు సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు… లాంగ్ రన్ ని ఇప్పటి దాకా కొనసాగించడం అద్బుతమైతే సినిమా కి 30 రోజుల తర్వాత కూడా హౌస్ ఫుల్ బోర్డులు పడటం అన్నది మాములు విషయం కాదనే చెప్పాలి.
మొత్తం మీద సినిమా మరోసారి డీసెంట్ గ్రోత్ ని 31వ రోజున సొంతం చేసుకోవడంతో….ఓవరాల్ గా ప్రాఫిట్ ను మరింతగా పెంచుకోబోతుంది ఈ సినిమా… వన్స్ టాక్ పాజిటివ్ గా వస్తే మెగాస్టార్ రేంజ్ ఎలా ఉంటుందో వాల్తేరు వీరయ్య సినిమా మరోసారి రుజువు చేసి సంచలనం సృష్టించడం విశేషం….