సెన్సేషనల్ కలెక్షన్స్ తో 5 వారాలను పూర్తి చేసుకున్నాక కూడా ఫుల్ జోరుతో దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD) సినిమా 5వ వారంలో ఉండగా ఇప్పటికీ కూడా షేర్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా మరోసారి వీకెండ్ రావడం, కొత్త సినిమాలు పోటి లో ఉన్నా కూడా కల్కిని చూడాలి అనుకుంటున్న ఆడియన్స్ ఇప్పటికీ ఉండటంతో…
మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తున్న సినిమా 31వ రోజులో అడుగు పెట్టి శనివారం అడ్వాంటేజ్ తో మరోసారి అన్ని చోట్లా కూడా సాలిడ్ కలెక్షన్స్ తో ట్రెండ్ ను చూపెడుతూ ఉండటం విశేషమని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో అలాగే హిందీలో సాలిడ్ గా జోరు చూపిస్తున్న సినిమా మిగిలిన చోట్ల మాత్రం కొత్త సినిమాల ఇంపాక్ట్ వలన థియేటర్స్ ని కోల్పోయింది…
అయినా కూడా 31వ రోజు బుకింగ్స్ లో మంచి గ్రోత్ ని చూపించిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 45-50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఇక హిందీ లో సినిమా ఈ రోజున 1.2-1.4 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా…
మిగిలిన చోట్ల కూడా పర్వాలేదు అనిపిస్తున్న కల్కి మూవీ మొత్తం మీద 31వ రోజున వరల్డ్ వైడ్ గా 1.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను కనుక అంచనాలను మించి పొతే సినిమా ఈ మార్క్ ని కూడా దాటేసి…
1.6 కోట్లు ఆ పైన షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. రిలీజ్ అయిన 31వ రోజున ఇలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక సినిమా ఓవరాల్ గా 31 రోజు సాధించే కలెక్షన్స్ ఇలానే ఉంటాయా లేక అంచనాలను మించుతాయో చూడాలి ఇప్పుడు… టోటల్ గా 31 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.