4 వారాలలో ఎపిక్ ఇండియన్ రికార్డులను బ్రేక్ చేసి సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) 5వ వారంలో అడుగు పెట్టి అన్ని చోట్లా మళ్ళీ మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా 31వ రోజున శనివారం అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా…
మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతుంది. ట్రాక్ చేసిన సెంటర్స్ లో తెలుగు రాష్ట్రాల్లో హిందీలో మంచి గ్రోత్ ఉండగా మిగిలిన చోట్ల మాత్రం కలెక్షన్స్ ఓకే అనిపించేలా బుకింగ్స్ ట్రెండ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే….
80-85 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఎంతైనా ఉంది. ఇక సినిమా కర్ణాటక తమిళ్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో స్లో అవ్వగా…
20 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకోవచ్చు. ఇక హిందీ లో ఈ రోజు గ్రోత్ బాగానే ఉండటంతో అక్కడ ఈ రోజు 5-5.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఫైనల్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకా పెరగవచ్చు…
ఓవర్సీస్ లో ఓకే అనిపించేలా హోల్డ్ చేసిన సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 31వ రోజున ఇప్పుడు 3.6-4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇక టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 31 రోజుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.