బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవ్వగా…రీసెంట్ టైంలో వచ్చిన బిగ్ పాన్ ఇండియా మూవీస్ తో పోల్చితే గేమ్ చేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా లేట్ గా ఓపెన్ చేశారు…. దాంతో బుకింగ్స్ ట్రెండ్ ఎలా ఉంటుందో అన్నది…
ఆసక్తిగా మారగా ఓవర్సీస్ లో మాత్రం బుకింగ్స్ పరంగా పెద్దగా ఏమి ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ టికెట్ హైక్స్ హెల్ప్ తో బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఎర్లీ ట్రెండ్ సాలిడ్ గా ఉండగా ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన…
అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ వరల్డ్ వైడ్ గా 30 కోట్ల మార్క్ ని దాటేసి దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. నైజాంలో బుకింగ్స్ లేట్ గా ఓపెన్ అవ్వగా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 11 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ జరగగా హిందీ లో పర్వాలేదు అనిపించేలా…
కర్ణటక తమిళ్ లో పర్వాలేదు అనిపిస్తూ దూసుకు పోతూ ఉండగా టోటల్ గా తెలుగు వర్షన్ కి గాను ఇండియా లో సినిమా 17 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ ను దాటేయగా ఇతర వర్షన్ ల బుకింగ్స్ తో 22 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను దాటేసింది….
ఇక ఓవర్సీస్ బుకింగ్స్ తో కలిపి వరల్డ్ వైడ్ గా 32 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను ఆల్ రెడీ అందుకున్న సినిమా ఇదే జోరుని కొనసాగిస్తే మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది. లేట్ గా బుకింగ్స్ ఓపెన్ అయినా కూడా ఉన్నంతలో…
మరీ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో కాక పోయినా కూడా రామ్ చరణ్ తన స్టార్ పవర్ తో సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకోవడానికి సిద్ధం అవుతున్నాడు. ఇక కంప్లీట్ గా బుకింగ్స్ ట్రెండ్ ను చూసి సినిమా మొదటి రోజు ఎలాంటి ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉందో మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం.