రానా దగ్గుబాటి సాయి పల్లవి ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ విరాట పర్వం, ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా చాలా కాలం అసలు వార్తల్లో నిలవలేదు, రెండేళ్ళ క్రితం ఈ సినిమా ఆల్ మోస్ట్ ఇక డిజిటల్ లో రిలీజ్ అవ్వడం ఖాయం అనుకున్నారు…. కానీ ఎందుకనో సడెన్ గా సినిమాను రీసెంట్ గా రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ ఉన్నప్పటికీ కూడా….
సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం ఏమాత్రం కూడా ఇంపాక్ట్ ని అయితే క్రియేట్ చేయలేక పోతుంది, కానీ ఈ సినిమాకి డిజిటల్ రిలీజ్ కి వచ్చిన రేటు మాత్రం ఎక్స్ లెంట్ గా ఉన్నప్పటికీ ఎందుకనో చివరి నిమిషంలో సురేష్ బాబు నో చెప్పారని అంటున్నారు. నెట్ ఫ్లిక్స్ వాళ్ళు ఈ సినిమా కోసం ఏకంగా…
30 కోట్ల రేంజ్ నుండి 32 కోట్ల రేంజ్ దాకా డైరెక్ట్ రిలీజ్ కోసం ఏడాది క్రితమే ఆఫర్ చేశారు…. దాంతో ఇక డీల్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయింది అంటూ వార్తలు వచ్చాయి, కానీ సురేష్ ప్రొడక్షన్ లో రీసెంట్ టైం లో వచ్చిన సినిమాలు డిజిటల్ లో….
రిలీజ్ అవ్వడంతో ఈ సినిమాను డిజిటల్ లో రిలీజ్ చేయకుండా థియేటర్స్ లో రిలీజ్ చేస్తే ఇప్పుడు కలెక్షన్స్ ఏమాత్రం ఆశించిన మేర రావడం లేదు. కానీ నటన పరంగా ఇటూ రానాకి కానీ అటు సాయి పల్లవికి కానీ మంచి అప్లాజ్ ఆడియన్స్ ఆడియన్స్ నుండి అయితే లభించింది అని చెప్పాలి. ఇద్దరి పెర్ఫార్మెన్స్ కి అందరూ ఫిదా అయ్యారు అనే చెప్పాలి.
కానీ సినిమా జానర్ దృశ్యా ప్రజెంట్ అలాంటి సినిమాలకు ఆదరణ తగ్గిపోవడంతో కలెక్షన్స్ పై ఆ ఇంపాక్ట్ గట్టిగా కనిపించింది, ఇలాంటి టైం లో ఈ సినిమా కి డిజిటల్ లోనే డైరెక్ట్ గా రిలీజ్ చేసి ఉంటె నిర్మాతకి ఫుల్ ప్రాఫిట్స్ వచ్చి ఉండేవి, కానీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రిజల్ట్ నిరాశ పరిచే విధంగా ఉండటం విచారకరం…