రిలీజ్ అయిన రోజు నుండి అన్ని చోట్లా ఊహకందని కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా అన్ని చోట్లా అల్టిమేట్ లాభాలను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా కూడా మమ్మోత్..
ప్రాఫిట్స్ తో మాస్ రచ్చ చేయగా….అందులో కూడా నైజాం ఏరియాలో సినిమా ఊహకందని లాంగ్ రన్ ను సొంతం చేసుకుని అల్టిమేట్ లాభాలను దక్కించుకుంది. సినిమా కి నైజాం ఏరియాలో వాల్యూ బిజినెస్ రేంజ్ 8.50 కోట్ల దాకా జరిగింది. సినిమా వీకెండ్ లోనే…
ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అవలీలగా బిజినెస్ ను రికవరీ చేసి మాస్ రచ్చ చేయగా తర్వాత కూడా ఎక్కడా స్లో డౌన్ అవ్వకుండా రిమార్కబుల్ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేసిన సినిమా రీసెంట్ గా నైజాం ఏరియాలో మమ్మోత్ 40 కోట్ల షేర్ మార్క్ ని దాటేసి…
విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది. ప్రస్తుతానికి ఆల్ మోస్ట్ 41 కోట్లకు పైగా షేర్ మార్క్ ని దాటేసి మాస్ రచ్చ చేసిన సినిమా 8.50 కోట్ల వాల్యూ బిజినెస్ మీద ఊహకందని రేంజ్ లో ఓవరాల్ గా…
32.50 కోట్లకు పైగా లాభాన్ని సొంతం చేసుకుని ఒక్క నైజాం ఏరియాలోనే సినిమా ఏకంగా క్వాడ్రపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మిగిలిన ఏరియాల్లో కూడా రిమార్కబుల్ లాభాలను అందుకుని రీసెంట్ టైంలో మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీగా నిలిచి దుమ్ము దుమారం లేపింది.