వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా రిమార్కబుల్ ట్రెండ్ ను హోల్డ్ ని చూపెడుతూ ఊహకందని రికార్డ్ లాభాలతో దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie), 5వ వీకెండ్ లో ఇప్పుడు మాస్ రచ్చ చేస్తూ దుమ్ము లేపుతుంది…
తెలుగు రాష్ట్రాల్లో అలాగే హిందీలో సినిమా 32వ రోజు సండే అడ్వాంటేజ్ తో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా మిగిలిన చోట్ల కలెక్షన్స్ లిమిటెడ్ గానే ఉన్నాయి…అయినా కూడా 32వ రోజులో సినిమాకి ఇలాంటి ట్రెండ్ కనిపించడం మాములు విషయం కాదు.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 32వ రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో 85-90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఇక కర్ణాటక, తమిళ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లు కలిపి సినిమా 40-45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 50 లక్షల మార్క్ ని అందుకోవచ్చు. ఇక హిందీలో ఈ రోజు మరోసారి కుమ్మేస్తూ దూసుకు పోతున్న సినిమా..
అక్కడ 5.5-6 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ లెక్కలు బాగుంటే 6.5 కోట్ల మార్క్ ని కూడా అందుకునే అవకాశం ఉంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 32వ రోజున ఇప్పుడు వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకుంటూ..
4.3-4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుండి ఓవర్సీస్ లో మరికొంత గ్రోత్ ని చూపిస్తే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది….ఇక టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 32 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.