కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు సంక్రాంతి బరిలో సాలిడ్ కలెక్షన్స్ ని వీకెండ్ లో సొంతం చేసుకుంది, కానీ తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం సినిమా రెండు తెలుగు రాష్ట్రలలో చాలా వరకు స్లో డౌన్ అయింది అని చెప్పాలి. ఆ ఇంపాక్ట్ వలన సినిమా కి బ్రేక్ ఈవెన్ కి ఛాన్స్ ఉందా లేదా…..
అన్న అనుమానాలు కూడా మొదలు అవ్వగా రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా స్లో డౌన్ అవుతూ రాగా నైజాం లో మాత్రం భారీగా అండర్ పెర్ఫార్మ్ చేసింది ఈ సినిమా. దాంతో సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుంటుంది అనేది….
ఆసక్తి గా మారగా సినిమా 18 రోజులు పూర్తీ అయ్యే టైం కి చూసుకుంటే ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్తీ చేసుకుంది అని చెప్పాలి. సినిమా కి మొత్తం మీద 33.80 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఇక్కడ సొంతం అయింది. దాంతో సినిమా….
బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమమ్ 34.50 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అయినా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా 18 రోజులు పూర్తీ అయ్యే టైం కి బంగార్రాజు సినిమా మొత్తం మీద 34.62 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల మట్టుకు చూసుకుంటే….
క్లీన్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక ఓవరాల్ గా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ కి మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు… నైజాంలో కూడా సినిమా కొంచం బెటర్ గా పెర్ఫార్మ్ చేసి ఉంటే ఓవరాల్ గా మంచి లాభాలు కూడా వచ్చి ఉండేవి కానీ ఇప్పుడు మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ గా నిలిచింది ఈ సినిమా.