బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ రెండో రోజు లో అడుగు పెట్టగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్స్ ట్రా ఆర్డినరీ హోల్డ్ తో దుమ్ము దులిపేసింది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్స్ ని సినిమా ఇప్పుడు అందుకోవడం ఖాయమని చెప్పాలి. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో….
42 కోట్ల నుండి 43 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే లెక్క మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, ఇక సినిమా హిందీ లో రెండో రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో…
హోల్డ్ చేసి దుమ్ము లేపిన సినిమా అవలీలగా 27 కోట్ల నుండి 28 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 11-12 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.
దాంతో ఇండియా లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజున 80 కోట్ల నుండి 83 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 కోట్ల రేంజ్ నుండి 11 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే….
ఈ లెక్కలు మరింత ముందుకు వెళ్ళొచ్చు. ఓవరాల్ గా సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 92 కోట్ల నుండి 94 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది, మరి ఈ అంచనాలను సినిమా అందుకుంటుందా లేక ఈ అంచనాలను కూడా మించి పోయి బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు సొంతం చేసుకుంటుందో చూడాలి. అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చాక అప్ డేట్ చేస్తాం…