Home న్యూస్ అక్షరాలా 335 కోట్లు….6వ రోజు అల్లకల్లోలం సామి!!

అక్షరాలా 335 కోట్లు….6వ రోజు అల్లకల్లోలం సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ 5 రోజులు పూర్తి అయ్యే టైంకి యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1 Movie) తెలుగు రాష్ట్రాల్లో 153.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూల్ చేయగా వరల్డ్ వైడ్ గా సినిమా 305.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని కుమ్మేసింది.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజు నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ తో రెచ్చిపోయిన సినిమా అన్ని చోట్లా వీర లెవల్ లో కలెక్షన్స్ రాంపెజ్ ను చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు 13-14 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే…

కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉంది…ఇక హిందీలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు కుమ్మేసిన సినిమా 8-9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక కర్ణాటకలో 2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…

Devara Movie 5 Days Total World Wide Collections!!

తమిళ్ అండ్ కేరళ మరియు ఓవర్సీస్ లు కలిపి ఓవరాల్ గా 2.5-3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా 6 వ రోజున ఇప్పుడు 27-28 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 29-30 కోట్ల రేంజ్ దాకా…

వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. ఇంతకుమించి వస్తే ఇక అది భీభత్సమే అని చెప్పాలి. ఈ కలెక్షన్స్ తో సినిమా 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 168 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 335 కోట్ల మార్క్ కి అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది.

ఇక ఓవరాల్ గా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక అంచనాలను మించి పొతే ఈ ఎక్స్ పెర్టేషన్స్ ని కూడా మించే ఛాన్స్ ఉంది…ఓవరాల్ గా 6వ రోజు సినిమా ఆల్ మోస్ట్ అల్లకల్లోలం సృష్టించింది అని చెప్పాలి. ఇక టోటల్ గా సినిమా 6 రోజుల ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Devara Movie 4 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here