లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాల్లో శివ కార్తికేయన్, సాయి పల్లవిల కాంబోలో రూపొందిన అమరన్ సినిమా ఒకటి…దీపావళికి భారీ పోటిలో రిలీజ్ అయినా ఇతర సినిమాలకు కూడా పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఊరమాస్ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేసిన ఈ సినిమా…
భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగు వర్షన్ టోటల్ రన్ లో 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని తెలుగు లో డబ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా కూడా కోలివుడ్ తరుపున…
మీడియం రేంజ్ హీరోలలో ఎవ్వరూ టచ్ చేయలేని రేంజ్ లో 335 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మేసింది. అలాంటి సినిమా తర్వాత డిజిటల్ లో కూడా కుమ్మేయగా తెలుగు లో రీసెంట్ గా టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ అయింది ఈ సినిమా..
స్టార్ మా ఛానెల్ లో డీసెంట్ ప్రమోషన్స్ ను సొంతం చేసుకుని టెలికాస్ట్ అయిన సినిమాకి ఫస్ట్ టైం టెలికాస్ట్ లో ఎక్స్ లెంట్ రేటింగ్ సొంతం అయ్యింది. రీసెంట్ టైంలో సినిమాలకు టెలివిజన్ లో సరైన రేటింగ్స్ రావడం లేదు…కొన్ని పెద్ద సినిమాలకు సైతం అంచనాలను అందుకునే రేటింగ్స్ రావడం లేదు.
అలాంటిది అమరన్ సినిమాకి తెలుగు లో ఫస్ట్ టైం టెలికాస్ట్ లో 9.19 టి.ఆర్.పి రేటింగ్ సొంతం అయ్యి ఇక్కడ కూడా కుమ్మేసింది. రీసెంట్ టైంలో తెలుగు లో టెలికాస్ట్ అయిన మూవీస్ లో సూపర్బ్ రేటింగ్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచి ఇక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా…