బాక్స్ అఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో కామెడీ పరంగా బాగానే వర్కౌట్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన సింగిల్(Single Movie)… పర్వాలేదు అనిపించే రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా…
ఎక్స్ లెంట్ గా జోరు ని చూపించిన సినిమా లాంగ్ రన్ లో మాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. శ్రీ విష్ణు కెరీర్ లో రికార్డ్ కలెక్షన్స్ ని అందుకుంటూ 34.5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుని దుమ్ము లేపిన…
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అవుతూనే లేటెస్ట్ గా డిజిటల్ లో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో సినిమా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా అక్కడ నుండి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ సొంతం అయ్యింది అన్నది ఆసక్తి గా మారగా…
ప్రజెంట్ ట్రెండ్ లో ఉన్న అనేక మీమ్స్ ని కథలో బాగా ఇన్వాల్వ్ చేశారని, కథ అంటూ పెద్దగా ఏమి లేక పోయినా కూడా సింగిల్ లైన్ పంచులు మీమ్స్ రిఫరెన్స్ లతో సినిమా ఫస్టాఫ్ బాగానే కామెడీతో వర్కౌట్ అవ్వగా సెకెండ్ ఆఫ్ స్టార్ట్ అవ్వడం కూడా అలానే స్టార్ట్ అయినా కూడా..
మధ్యలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఫోర్స్ గా అనిపించింది అంటూ ఉండగా మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుండి టైటిల్ ని జస్టిఫై చేస్తూ తీసిన క్లైమాక్స్ ఎపిసోడ్ బాగానే ఆకట్టుకుందని, ఓవరాల్ గా డీసెంట్ కామెడీతో సినిమా బాగానే ఆకట్టుకునేలా ఎండ్ అయ్యిందని అంటున్నారు.
మరీ అద్బుతం కాదు కానీ మినిమమ్ గ్యారెంటీ ఎంటర్ టైన్ మెంట్ తో సినిమా పర్వాలేదు అనిపించేలా ఎంటర్ టైన్ చేసిందని అంటున్నారు. ఓవరాల్ గా డిజిటల్ రిలీజ్ తర్వాత సినిమాకి మంచి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వస్తూ ఉండగా సాలిడ్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గరే కాదు డిజిటల్ లో కూడా మంచి హిట్ గా నిలిచింది…