Home న్యూస్ 1600 కోట్ల సినిమా….3485 కోట్లతో రికార్డుల జాతర!

1600 కోట్ల సినిమా….3485 కోట్లతో రికార్డుల జాతర!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన చిన్న పిల్లల సినిమా ఇన్ సైడ్ ఔట్2(Inside Out 2 Movie) రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా ఈ ఇయర్ హాలీవుడ్ లో రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. పేరుకు చిన్న పిల్లల సినిమానే అయినా కూడా…

బడ్జెట్ పరంగా చూసుకుంటే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆల్ మోస్ట్ ఇండియన్ కరెన్సీలో 1600 కోట్ల రేంజ్ మమ్మోత్ బడ్జెట్ తో తెరకెక్కగా కలెక్షన్స్ పరంగా కూడా దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా అమెరికాలో మొత్తం మీద 235 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసింది…

ఇండియన్ కరెన్సీలో ఓవరాల్ గా 1950 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ ఓవర్సీస్ లో సినిమా 185 మిలియన్ డాలర్స్ మార్క్ దాకా వసూళ్ళని అందుకోగా టోటల్ గా ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 1535 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది.

దాంతో టోటల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ 420 మిలియన్ మార్క్ ని దాటడం విశేషం కాగా ఇండియన్ కరెన్సీలో ఆల్ మోస్ట్ 3,485 కోట్ల మమ్మోత్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమా త్వరలోనే హాల్ఫ్ మిలియన్ మార్క్ ని అందుకోబోతుండగా లాంగ్ రన్ లో అవలీలగా 1 బిలియన్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని అంచనా వేస్తున్నారు ఇప్పుడు. ఇక లాంగ్ రన్ లో సినిమా ఈ మార్క్ ని ఎన్ని రోజుల్లో అందుకుంటుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here