Home న్యూస్ 34 కోట్ల రేటు పెట్టారు…మినిమమ్ ప్రమోషన్స్ లేవు!

34 కోట్ల రేటు పెట్టారు…మినిమమ్ ప్రమోషన్స్ లేవు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటే కొంచం బజ్ ఎక్కువగా ఉండేదేమో కానీ డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్న యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్ట్రో సినిమా కి మినిమం బజ్ కూడా ప్రస్తుతం లేదనే చెప్పాలి. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అంధధూన్ సినిమా తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 17 న డైరెక్ట్ గా…

డిజిటల్ రిలీజ్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సొంతం చేసుకోబోతుంది. ఈ సినిమా కోసం ఏకంగా 34 కోట్ల భారీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు ట్రైలర్ రిలీజ్ తోనే సినిమా పై ఆసక్తి తగ్గేలా చేశారు. ఒరిజినల్ కట్ మాదిరిగానే సీన్ టు సీన్..

దింపుతూ అదే కట్ ని రిపీట్ చేయగా ట్రైలర్ కి ఓవరాల్ రెస్పాన్స్ యావరేజ్ గా వచ్చింది. ఇప్పుడు సినిమా వారంలో రాబోతుంది కానీ ఏమాత్రం బజ్ ని క్రియేట్ చేయలేక పోతున్నారు మేకర్స్ అండ్ డిస్నీ ప్లస్ వాళ్ళు… ఇక సినిమానే టాక్ సొంతం చేసుకుని జనాలు సినిమా గురించి మాట్లాడుకునేలా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here