5వ వీకెండ్ వరకు వీర లెవల్ లో కలెక్షన్స్ తో ఊరమాస్ రాంపెజ్ ను చూపించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie), వర్కింగ్ డేస్ లో మాత్రం ఎక్కువ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ ఉండగా, హిందీ మరియు తెలుగు రాష్ట్రాలలో మినహా మిగిలిన చోట్ల మాత్రం సినిమా…
ఆల్ మోస్ట్ రన్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 34వ రోజున మరోసారి పర్వాలేదు అనిపిస్తూ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా, 33వ రోజుతో పోల్చితే డ్రాప్స్ లిమిటెడ్ గానే ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు…
34 వ రోజున ఓవరాల్ గా 25 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమా హిందీ లో ఈ రోజు 1.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా మిగిలిన చోట్ల కలెక్షన్స్ మరింతగా డ్రాప్ అయ్యాయి.
దాంతో ఓవరాల్ గా సినిమా ఇప్పుడు 34వ రోజున వరల్డ్ వైడ్ గా 1-1.1 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ మరికొంచం పెరిగే అవకాశం కొద్ది వరకు ఉందని చెప్పాలి ఇప్పుడు.
మొత్తం మీద సినిమా ఇప్పటి వరకు రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ షేర్ పరంగా 33 రోజులుగా కోటికి తగ్గకుండా షేర్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేసింది. ఇక సంక్రాంతి సినిమాలు వస్తూ ఉండటంతో సినిమా రన్ స్లో డౌన్ అవ్వగా ఇక టోటల్ గా 34 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి….