తమిళ్ హీరోలలో తెలుగు లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న వాళ్ళు కొందరు ఉండగా ఇప్పుడు వాళ్ళలో ఒకడిగా నిలిచి దుమ్ము లేపాడు ధనుష్, అడపాదడపా తెలుగు లో సినిమాలను ఎప్పటి కప్పుడు రిలీజ్ చేస్తూనే ఉన్నా కానీ అనుకున్న రేంజ్ లో మాత్రం ఏ సినిమా అంచనాలను అందుకోలేదు. ఇలాంటి టైం లో ఆడియన్స్ ముందుకు తెలుగు తమిళ్ బైలింగువల్ గా తెరకెక్కిన సార్ మూవీ కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపుతూ…
ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు వర్షన్ ఏకంగా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాంతో పాటు సినిమా ఇప్పుడు 17వ రోజున సాధించిన కలెక్షన్స్ తో మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 35 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించింది…
మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఎక్స్ లెంట్ గా రన్ అవుతూ ఉండగా 17 రోజుల్లో టోటల్ గా 18.68 కోట్ల షేర్ ని 35 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకోగా తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్ గా 20 కోట్ల షేర్ మార్క్ ని కూడా అందుకుని దుమ్ము లేపడం విశేషం.
ఇక సినిమా తెలుగు రాష్ట్రాలలో లాంగ్ రన్ లో 40 కోట్ల రేంజ్ కి దగ్గర అయ్యే కలెక్షన్స్ ని లేదా దాటేసే కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కూడా ఎంతైనా ఉందని చెప్పాలి. అన్ సీజన్ లో అద్బుతమైన కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ధనుష్ తెలుగు లో ఒక్క సినిమాతో సాలిడ్ క్రేజ్ ని సాధించాడు అని చెప్పాలి.