Home గాసిప్స్ 35 నిమిషాలు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం!!

35 నిమిషాలు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం!!

779
0

   టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు బాక్ టు బాక్ 100 కోట్ల సినిమాల తర్వాత చేస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా రీసెంట్ గా షూటింగ్ లో రెండో షెడ్యూల్ పూర్తి అయిందని యూనిట్ కన్ఫాం చేసింది.

కాగా రెండో షెడ్యూల్ షూటింగ్ మొత్తం ట్రైన్ లో జరగగా దాదాపు సినిమా లో 35 నిమిషాల ట్రైన్ ఎపిసోడ్ ఉంటుందట. అది నాన్ స్టాప్ గా కామెడీ సీన్స్ తో దుమ్ము లేపే రేంజ్ లో తెరకెక్కించినట్లు సమాచారం. దాంతో తెలుగు లో ట్రైన్ కామెడీ లో నంబర్ 1 అయిన…

వెంకీ సినిమాలో సీన్ రేంజ్ లో సరిలేరునీకేవ్వరు సినిమా ట్రైన్ ఎపిసోడ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కామెడీ తో దుమ్ము లేపడం అనిల్ రావిపూడి కి అలవాటు కాబట్టి ఈ 35 నిమిషాల ట్రైన్ ఎపిసోడ్ కి థియేటర్స్ నవ్వులతో దద్దరిల్లిపోవడం ఖాయామని అంచనా వేస్తున్నారు. సినిమా సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here