బాక్స్ ఆఫీస్ దగ్గర వినాయక చవితి వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో 35 మూవీ(35 Movie 4 Days Collections) మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా కూడా స్లో స్టార్ట్ తర్వాత మంచి జోరునే చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా ఓన్ రిలీజ్ అయినా కూడా చాలా వరకు డీసెంట్ హిట్ దిశగా పరుగులు పెట్టగా…
ఆల్ మోస్ట్ క్లీన్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి ఇప్పుడు. సినిమా 3 రోజుల వీకెండ్ పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 2.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 3.00 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా వర్త్ షేర్ పరంగా సినిమా…
ఆల్ మోస్ట్ 1.65 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకున్న సినిమా 4వ రోజు వర్కింగ్ డే లోకి ఎంటర్ అయిన తర్వాత ఆల్ మోస్ట్ 6 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా…
వరల్డ్ వైడ్ గా సినిమా 35 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 2.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ను వరల్డ్ వైడ్ గా 3.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వర్త్ షేర్ పరంగా 1.80 కోట్ల రేంజ్ లో షేర్ ని…
అందుకున్న సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 2.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకోవాల్సి ఉండగా లాంగ్ రన్ లో ఈ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా మంచి పాజిటివ్ రివ్యూల హెల్ప్ తో సినిమా బాక్స్ అఫీస్ దగ్గర మంచి పెర్ఫార్మెన్స్ నే చూపెడుతూ దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.