చంద్రముఖి, మాస్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి సుపరిచితురాలే అయిన జ్యోతిక సూర్య అడపా దడపా తమిళ్ సినిమాను చేస్తూ వాటిని వీలు కుదిరినప్పుడల్లా తెలుగు లో డబ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం థియేటర్స్ తెరవలేని పరిస్థితులు ఉన్న నేపధ్యంలో ఆహా యాప్ ద్వారా తెలుగు లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఎలా ఉంది… ఆడియన్స్ ని మెప్పించిందా లేదా తెలుసు కుందాం పదండీ…
కథ పాయింట్ కి వస్తే… 36 ఏజ్ వచ్చే నాటికీ తన ఫ్యామిలీ తో ఇర్లాండ్ లో సెటిల్ అవ్వాలి అనుకున్న జ్యోతిక అనుకోకుండా ఒకసారి రాష్ట్రపతిని కలవడం తర్వాత కొన్ని కారణాల వల్ల ఫ్యామిలీ ని వదిలేసి ఇర్లాండ్ వెళ్ళాల్సి వస్తుంది, అక్కడ ఎలా తాను ఫ్యామిలీ ని గుర్తు చేసుకుంటూ…
ఆ భాద ని దాటేసి ఒక సక్సెస్ ఫుల్ వుమన్ గా ఎదిగింది అన్నది ఓవరాల్ గా సినిమా కథ పాయింట్… పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పూర్తిగా జ్యోతిక వన్ వుమన్ షో గా చెప్పుకోవచ్చు. జ్యోతిక భర్త పాత్ర చేసిన రహ్మాన్ కూడా మెప్పించినా పూర్తిగా జ్యోతిక డామినేషన్ సినిమా అంతా ఉంటుంది.
సినిమా కి సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఫీల్ కి తగ్గట్లు మెప్పించాగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే నాసిరకంగానే ఉంది, ముఖ్యంగా సినిమా టేక్ ఆఫ్ అవ్వడానికి కొంత సమయం తీసుకోగా బోర్ కొట్టేస్తుంది. ఇక సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పిస్తాయి. ఇక డైరెక్షన్ పరంగా రోషన్ ఆండ్రూస్ బాగానే తెరకెక్కించాడు కానీ…
సినిమా లో మైనస్ లు కూడా చాలానే ఉన్నాయి. మలయాళంలో 2014 లో హౌ ఓల్డ్ ఆర్ యు సినిమా రీమేక్ గా వచ్చిన ఈ సినిమా 2015 లో తమిళ్ లో తెరకెక్కగా పెద్దగా మార్పులు లేకుండానే సీన్ టు సీన్ ని దింపేశారు. తమిళ్ ఆడియన్స్ ఎలాగోలా చూశారు కానీ తెలుగు ఆడియన్స్ మెచ్చే సీన్స్ తక్కువగానే ఉన్నాయి అని చెప్పాలి.
ఫస్టాఫ్ టేక్ ఆఫ్ అవ్వడానికి సగం టైం పట్టగా మళ్ళీ ఇంటర్వల్ తర్వాత స్లో డౌన్ అవుతుంది సినిమా. జ్యోతిక రోల్ ని హైలెట్ చేయడానికి వేరే పాత్రలను తగ్గించడం మరీ నెగటివ్ గా చూపించారా అన్నట్లు కొన్ని సీన్స్ ఉంటాయి. అవన్నీ పక్కకు పెడితే కొద్దిగా పడుతూ లేస్తూ సాగే స్క్రీన్ ప్లే ని బరిస్తూ చూస్తె…
సినిమా సెకెండ్ ఆఫ్ ఎక్కువగా శ్రీదేవి గారు నటించిన ఇంగ్లిష్ వింగ్లిష్ పోలికలు ఎక్కువగా కనిపిస్తాయి. అవి కూడా బరించి సినిమా పూర్తీ చేసే సరికి కష్టంగానే ముగించాం అన్న భావన కలుగుతుంది. ఓవరాల్ గా జ్యోతిక పెర్ఫార్మెన్స్ కోసం కొంచం కష్టం అయినా ఒకసారి చూడొచ్చు.
ఓవరాల్ గా జస్ట్ ఓకే అనిపించే సినిమా 36 వయసులో… ఎలాగూ కొత్త సినిమాలు లేని టైం లో వచ్చిన సినిమా వచ్చినట్లు చూసే వాళ్ళు ఖాళీ టైం లో ఈ సినిమా ను ఒకసారి చూడొచ్చు. సినిమా కి మొత్తం మీద మేం ఇస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్…