బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ టాక్ ను మొదటి ఆటకే సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ లాభాలను దక్కించుకుంటూ పరుగును కొనసాగిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా…
176.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా, వరల్డ్ వైడ్ గా 350 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించింది. ఇక సినిమా 9వ రోజు శనివారం అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా మంచి గ్రోత్ ని చూపించగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పరంగా కూడా కుమ్మేసింది….
సినిమా మొత్తం మీద 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 6.5 కోట్ల దాకా వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇక హిందీలో సినిమా 3.5 కోట్ల రేంజ్ నుండి….
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 4 కోట్ల లోపు గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, కర్ణాటక, తమిళ్, కేరళ మరియు ఓవర్సీస్ లు కలిపి 2 కోట్ల రేంజ్ నుండి 2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సాధించే అవకాశం కనిపిస్తుంది.
9వ రోజు వరల్డ్ వైడ్ గా 12.5 కోట్ల రేంజ్ నుండి ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 13 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవచ్చు…ఈ కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు…ఓవరాల్ గా 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 182.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా…
363 కోట్ల లోపు గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే ఈ కలెక్షన్స్ ఇంకా పెరగవచ్చు, మొత్తం మీద మిక్సుడ్ టాక్ తో కూడా సినిమా ఇప్పటి వరకు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ లాభాలను పెంచుకుంటూ దూసుకు పోతుంది సినిమా….