Home న్యూస్ అక్షరాలా 3650 కోట్లు….రికార్డుల తుక్కు రేగ్గొడుతున్న డెడ్ పూల్ వుల్వరిన్!!

అక్షరాలా 3650 కోట్లు….రికార్డుల తుక్కు రేగ్గొడుతున్న డెడ్ పూల్ వుల్వరిన్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ బిగ్గీ డెడ్ పూల్ అండ్ వుల్వరిన్(Deadpool & Wovlerine 3 Days Collections) సినిమా అన్ని చోట్లా అద్బుతమైన కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది. సినిమా ఇండియాలో వీకెండ్ లో సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా సండే మంచి జోరుని చూపించింది ఈ సినిమా…

2 రోజుల్లో 44 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా 3వ రోజు మరోసారి 23 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా 3 రోజుల్లో ఇండియాలో సినిమా 67 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపగా 85 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…

ఇక వరల్డ్ వైడ్ గా కూడా సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా నార్త్ అమెరికాలో సినిమా వీకెండ్ లో 205 మిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్ళని అందుకోగా ఇండియన్ కరెన్సీలో ఓవరాల్ గా 1710 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకోగా ఇక టోటల్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ లో సినిమా…

Deadpool & Wolverine 1st Day India Collections!

వీకెండ్ లో ఏకంగా 234 మిలియన్ డాలర్స్ దాకా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊచకోత కోసింది. ఇండియన్ కరెన్సీలో ఓవరాల్ గా సినిమా 1940 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా అన్ని చోట్లా కలిపి సినిమా….

439 మిలియన్ డాలర్స్ రేంజ్ లో వసూళ్ళతో దుమ్ము లేపింది. ఇండియన్ కరెన్సీలో ఆల్ మోస్ట్ 3650 కోట్ల గ్రాస్ ను అందుకున్న సినిమా R రేటెడ్ మూవీస్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకోగా ఓవరాల్ గా సూపర్ హీరోల సినిమాల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్ట్ ను అందుకుని 1 బిలియన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here