Home న్యూస్ 36.15 కోట్ల బిజినెస్….2 రోజుల వీకెండ్ లో వచ్చిన కలెక్షన్స్ ఇవి!

36.15 కోట్ల బిజినెస్….2 రోజుల వీకెండ్ లో వచ్చిన కలెక్షన్స్ ఇవి!

2463
0

కోలివుడ్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ డాక్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల వీకెండ్ లో రిలీజ్ అవ్వగా సినిమా తమిళ్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా తెలుగు లో సినిమా సైలెంట్ గా రిలీజ్ అయ్యి సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. సినిమా తెలుగు లో ఫస్ట్ డే 22 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా రెండో రోజు…

డబుల్ రేంజ్ అనిపించేలా 37 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంత్ గ్రోత్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది… ఆల్ మోస్ట్ 100 కి పైగా స్క్రీన్స్ ని పెంచుకున్న ఈ సినిమా ఎంటర్ టైన్ మెంట్ ని ఇష్టపడే వాళ్ళు ఎగబడటంతో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంది.

మొత్తం మీద 2 రోజుల తెలుగు కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 16L
👉Ceeded: 8L
👉UA: 8.2L
👉East: 6L
👉West: 5L
👉Guntur: 6L
👉Krishna: 6L
👉Nellore: 4L
AP-TG Total:- 0.59CR(1.05CR~ Gross)
సినిమాను తెలుగు లో 1.35 కోట్లకు అమ్మగా 1.6 కోట్ల టార్గెట్ కి 2 రోజుల తర్వాత….

ఇంకా 1.01 కోట్ల షేర్ దూరంలో ఉంది ఈ సినిమా… ఇక తమిళ్ లో 2వ రోజు ఆల్ మోస్ట్ 8.1 కోట్ల గ్రాస్ ని అందుకుందట ఈ సినిమా, టోటల్ గా 2 రోజుల్లో 14.8 కోట్ల గ్రాస్ ని అందుకుందట. రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద తెలుగు తో కలిపి 1.7 కోట్ల గ్రాస్ ని అందుకోగా ఓవర్సీస్ లో…

4 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుందట. దాంతో 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 20.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని 11 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుందట. సినిమాను తమిళ్ తెలుగు కలిపి 36.15 కోట్ల కి అమ్మారు… ఆ లెక్కన సినిమా ఇంకా 26 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here