రిమార్కబుల్ కలెక్షన్స్ తో ఊరమాస్ జోరు చూపించి కుమ్మేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) 5 వారాలను ఊరమాస్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని మాస్ ఊచకోత కోసింది. అన్ని చోట్లా రిమార్కబుల్ ట్రెండ్ ను చూపించి ఊహకందని లాభాలను సొంతం చేసుకున్న ఈ సినిమా…
5 వారాలను పూర్తి చేసుకుని ఇప్పుడు 6వ వారంలో అడుగు పెట్టగా 36వ రోజున మరోసారి పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపెడుతూ ఉన్నప్పటికీ కూడా 5 వారాల తర్వాత మొదటి సారి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ డే షేర్ కోటి లోపు ఉండబోతుంది…
5 వారాల పాటు నాన్ స్టాప్ గా వరల్డ్ వైడ్ గా ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా షేర్ ని అందుకున్న పుష్ప2 మూవీ 36వ రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ఓవరాల్ గా 20 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా….
హిందీలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు 1.2 కోట్లకు కి పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా మిగిలిన చోట్ల మాత్రం సినిమా స్లో డౌన్ అయింది అని చెప్పాలి …దాంతో ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి 36వ రోజున వరల్డ్ వైడ్ గా 80-90 లక్షల రేంజ్ లో…
షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఇప్పటికీ షేర్స్ రావడం మాస్ ఊచకోత అయినా కూడా ఇక సంక్రాంతి సినిమాలకు పుష్ప2 దారి వదిలే అవకాశం కనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 36 రోజుల్లో సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.