ఒక సినిమా హిట్ అయితే చాలు అప్ కమింగ్ మూవీ తమతో చేయాలి అంటూ ఆఫర్స్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఎవరితో చేయాలి అని ఎంచుకోవడం మాత్రం కష్టం, ప్రస్తుతం ఇదే కష్టం లో ఉన్నాడు బాక్స్ ఆఫీస్ దగ్గర 370 కోట్ల కలెక్షన్స్ ని అందుకుని బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసిన డైరెక్టర్ పరిస్థితి. అది కూడా రీమేక్ సినిమా తో సాధించాడు ఈ ఘనత…
అతనే సందీప్ రెడ్డి వంగ… తెలుగు లో పాత్ బ్రేకింగ్ మూవీ గా నిలిచిన అర్జున్ రెడ్డి ని హిందీ లో కబీర్ సింగ్ పేరుతొ షాహిద్ కపూర్ తో రీమేక్ చేయగా సినిమా ఆల్ రెడీ ఒరిజినల్ చూసినవాళ్ళు కూడా విరగబడి చూడగా ఇండియా లోనే 270 కోట్లకు పైగా కలెక్షన్స్ ని…
వరల్డ్ వైడ్ గా 370 కోట్ల రేంజ్ వసూళ్ళ ని సాధించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ సందీప్ రెడ్డి వంగ కొత్త సినిమా ఇప్పటి వరకు మొదలు కాలేదు… డెవిల్ అనే కథ ని బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో చేయాలి అనుకున్నా హీరో కమిట్ మెంట్స్ వలన…
ఈ ప్రాజెక్ట్ అక్కడ సెట్ అవ్వలేదు, ఇక తెలుగు లో చేద్దాం అనుకుంటే దాదాపు అందరూ బిజీగా ఉండటం తో ఎవ్వరీతొనూ సెట్ అవ్వడం లేదని తెలుస్తుంది, తిరిగి విజయ్ దేవరకొండ తో మరో సినిమా చేస్తున్నాడు అనే టాక్ వచ్చినప్పటికీ అవి ఇప్పటి వరకూ కూడా రూమర్స్ గానే ఉన్నాయి. మొత్తం మీద…
రెండు బ్లాక్ బస్టర్ విజయాలను రెండు ఇండస్ట్రీ లలో సొంతం చేసుకున్నా కానీ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కొత్త సినిమా కి హీరో దొరకాల్సి ఉందని లేటెస్ట్ టాక్. ప్రస్తుతం తెలుగు లో అయితే మరో మీడియం రేంజ్ మూవీ ని, హిందీ లో అయితే కుదిరితే డెవిల్ ని మరో హీరోగా భారీ లెవల్ లో చేయాలి అన్న ప్లానింగ్ లో ఉన్నారట. మరి ఫైనల్ గా ఎవరు కమిట్ అవుతారో చూడాలి మరి.