బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన సలార్(Salaar Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఉండగా 3 రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో ట్రేడ్ లెక్కల్లో 140 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా 330 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుని దుమ్ము లేపింది….
సినిమా ఇక 4వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 22-24 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా హిందీలో ఈ రోజు 17-18 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, ఇక సినిమా కర్ణాటక, తమిళ్ మరియు కేరళ కలిపి అటూ ఇటూగా 10 కోట్ల రేంజ్ లో…
గ్రాస్ అందుకునే అవకాశం ఉండగా టోటల్ గా ఇండియాలో సినిమా 4వ రోజున అన్నీ అనుకున్నట్లు జరిగితే 48-50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఓవర్సీస్ లో అనుకున్న రేంజ్ లో జోరు చూపించలేక పోతున్న సినిమా అక్కడ 6-7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది.
దాంతో టోటల్ గా సినిమా 4వ రోజు వరల్డ్ వైడ్ గా 55 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది… దాంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమా 4 రోజుల్లో 162 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 385 కోట్లకి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది.
ఒకవేళ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే లెక్క కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఓవరాల్ గా సినిమా 4 రోజులకు గాను సాధించే అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి ఇప్పుడు…