బాక్స్ ఆఫీస్ దగ్గర నైజాం మార్కెట్ భారీగా పెరిగి పోయింది, రీసెంట్ టైం లో టికెట్ హైక్స్ విపరీతంగా పెరిగి పోవడంతో బిజినెస్ లు ఏ రేంజ్ లో జరుగుతున్నా కానీ టాక్ మాత్రం పాజిటివ్ గా వస్తే అన్ని ఏరియాల కన్నా ముందు నైజాం ఏరియాలోనే సినిమాల బ్రేక్ ఈవెన్ ముందుగా జరుగుతూ వస్తుంది, ఆర్ ఆర్ ఆర్ ఏకంగా 111 కోట్లకు పైగా షేర్ తో చరిత్ర సృష్టించింది, రీసెంట్ గా వచ్చిన…
కేజిఎఫ్ చాప్టర్ 2 సైతం 40 కోట్లకి పైగా షేర్ తో రికార్డులు తిరగరాసింది. కానీ భారీ స్టార్ కాస్ట్ తో వచ్చిన మెగా మల్టీ స్టారర్ మూవీ ఆచార్య మాత్రం నైజాం ఏరియాలో ఊహకందని నష్టాలను ఇప్పుడు సొంతం చేసుకోబోతుంది. మిగిలిన ఏరియాల బిజినెస్ లతో పోల్చితే…
టాక్ ఎలా ఉన్నా నైజాంలో వీకెండ్ కలెక్షన్స్ సూపర్ సాలిడ్ గా ఉంటూ వచ్చాయి రీసెంట్ మూవీస్ కి, కానీ ఆచార్య కి రిలీజ్ రోజు నుండే అంతంత మాత్రంగానే బుకింగ్స్ ఉండగా టాక్ నెగటివ్ గా రావడంతో తర్వాత తేరుకోలేక పోయింది. వరంగల్ శ్రీను ఈ సినిమాను ఏకంగా 38 కోట్ల రేటు కి కొనగా….
ఇతర ఖర్చులు లేట్ అవ్వడం లాంటివి కలిపి సినిమా 40 కోట్ల మేర రికవరీ చేయాల్సి ఉండగా అందులో అతి కష్టం మీద ఇప్పటి వరకు 12.35 కోట్ల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకున్న ఆచార్య సినిమా ఓన్లీ బిజినెస్ పరంగానే చూసుకుంటే ఇంకా 25.65 కోట్లు రికవరీ చేయాల్సి ఉంది…. ఆ కలెక్షన్స్ లో కోటి కూడా రికవరీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు ఇప్పుడు….
దాంతో వరంగల్ శ్రీను కి బిగ్గెస్ట్ లాస్ ను సొంతం అయ్యేలా చేయబోతున్న ఈ సినిమా కి వచ్చిన నష్టాలలో కొద్ది వరకు రిటర్న్ ఇవ్వబోతున్నారు మేకర్స్… అది ఎంత అయి ఉంటుంది అన్న వివరాలు త్వరలో తెలియనున్నాయి. మొత్తం మీద మిగిలిన ఏరియాలను మించి సినిమా నైజాం ఏరియాలో ఆల్ టైం ఎపిక్ నష్టాలను సొంతం చేసుకున్న సినిమాగా నిలవబోతుంది అని చెప్పాలి.