6వ వీకెండ్ లో అడుగు పెట్టినా కూడా ఇప్పటికీ టికెట్ సేల్స్ పరంగా మంచి జోరుని చూపిస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD) ఇప్పటికీ కుమ్ముతూ ఉండగా మరో పక్క రెండో వారంలో అడుగు పెట్టిన రాయన్(Raayan Movie) ఎక్స్ లెంట్ ట్రెండ్ తో వీకెండ్ లో జోరు చూపిస్తూ దూసుకు పోతూ ఉంది…
మొత్తం మీద రెండు సినిమాలు ఆగస్టు 3న శనివారం అడ్వాంటేజ్ తో కుమ్మేస్తూ ఉండటం విశేషం…కల్కి మూవీ టికెట్ రేట్స్ తగ్గించడంతో బుకింగ్స్ లో మంచి గ్రోత్ కనిపిస్తూ ఉండగా షేర్స్ మరీ ఎక్కువగా వచ్చే అవకాశం లేకున్నా ఇప్పటికీ టికెట్ సేల్స్ సాలిడ్ గా ఉండటం విశేషం…
మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా మరోసారి 20 లక్షల మార్క్ ని దాటేసి 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా హిందీలో మంచి జోరునే చూపిస్తున్న సినిమా మిగిలిన చోట్ల స్లో అయినా 38వ రోజున వరల్డ్ వైడ్ గా ఇప్పుడు….
75 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక 9వ రోజులో ఉన్న రాయన్ మూవీ అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా జోరుని చూపిస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా…
9వ రోజున 32-35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా తమిళ్ లో రెట్టించిన జోరు చూపిస్తున్న సినిమా అక్కడ 3.5-4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా ఈ రోజున 7-8 కోట్ల రేంజ్ లో…
గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మిగిలిన కొత్త సినిమాలతో పోల్చితే ఇప్పటికీ బెటర్ గా ఈ రెండు సినిమాలు కుమ్మేస్తూ ఉండటం విశేషం. ఇక ఈ రోజు అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.