రీసెంట్ టైంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ ఊహకందని హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కల్కి(Kalki 2898 AD) ఊరమాస్ జోరుని ఇప్పటికీ కొనసాగిస్తూ ఉండగా 6వ వారంలో ఇక సినిమా స్లో డౌన్ అవ్వడం ఖాయం అనుకుంటే అదే టైంలో…
మేకర్స్ సినిమా టికెట్ రేట్స్ ను పూర్తిగా తగ్గించి కొత్త సినిమాల కన్నా కూడా బెటర్ ఆప్షన్ కల్కి మూవీనే అనిపించేలా ప్లాన్ చేశారు. కొత్త సినిమాల టాక్ కూడా ఏమాత్రం ఇంప్రెస్ చేసే విధంగా లేక పోవడంతో కల్కి మూవీనే ఆడియన్స్ కి మొదటి బెస్ట్ ఆప్షన్ గా మారింది.
బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ అడ్వాంటేజ్ తో పాటు ఇప్పుడు 39వ రోజున సండే అడ్వాంటేజ్ అలాగే ఫ్రెండ్షిప్ డే అడ్వాంటేజ్ కూడా కలిసి వచ్చి సినిమా అన్ని చోట్లా రెట్టించిన జోరు చూపిస్తూ ఉండగా ఆంధ్రలో హైదరాబాదులో అలాగే నార్త్ సెంటర్స్ కొన్ని చోట్ల ఇప్పుడు సినిమా..
మ్యాట్నీ షోల నుండే మంచి ఆక్యుపెన్సీ ఉండగా కొన్ని చోట్ల 70-80% ఆక్యుపెన్సీ ఉండగా మరి కొన్ని చోట్ల ఏకంగా షోలు హౌస్ ఫుల్ బోర్డులు పడే రేంజ్ లో మెప్పించడం విశేషం అని చెప్పాలి. రిలీజ్ అయిన 39వ రోజు ఇలా సూపర్బ్ ఆక్యుపెన్సీతో హౌస్ ఫుల్ బోర్డులు…
ఈ టైంలో రిలీజ్ అయ్యే సినిమాలకు సొంతం అవ్వడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి…ఆ రేంజ్ లో ఎపిక్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న కల్కి మూవీ రీసెంట్ టైంలోనే స్టార్స్ నటించిన సినిమాల్లో ఎపిక్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసిన సినిమాగా నిలిచింది అని చెప్పాలి.