బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ వారంలో అద్బుతమైన కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కల్కి(Kalki 2898 AD) మరో పక్క రెండో వీకెండ్ లో ఉన్న ధనుష్(Dhanush) సూపర్ హిట్ రాయన్(Raayan Movie) ఈ వీకెండ్ లో జోరు ని చూపిస్తూ ఉండగా రెండు సినిమాలు కూడా ఈ రోజు…
ఆగస్టు 4 సండే అడ్వాంటేజ్ తో మంచి జోరుని చూపిస్తూ ఉన్నాయి… మొత్తం మీద కల్కి మూవీ ఇప్పటికీ సాలిడ్ గా షేర్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా 39వ రోజు మరోసారి ఆల్ మోస్ట్ 38 వ రోజు లెవల్ లో ట్రెండ్ ను చూపెడుతూ ఉంది.
దాంతో ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 30-32 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరగవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా కూడా జోరు చూపిస్తూ ఉండగా ఓవరాల్ గా 90 లక్షల రేంజ్ నుండి 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది.
ఫైనల్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉండగా ఇక 10వ రోజులో రెట్టించిన జోరు చూపిస్తున్న ధనుష్ నటించిన రాయన్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మంచి జోరుని చూపెడుతూ 30 లక్షలకు పైగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.
ఇక తమిళ్ లో ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తున్న సినిమా 4.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ లో సినిమా సాలిడ్ గా ట్రెండ్ ను చూపిస్తూ ఉండటంతో 8-9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది.
ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 10 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ ను ఈ రోజు సాలిడ్ గా ముగించబోతున్నాయి. ఇక రెండు సినిమాల ఈ రోజు సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.