Home న్యూస్ సిద్ధార్థ్ ‘3BHK’ మూవీ టాక్ ఏంటి…..మూవీ హిట్టా-ఫట్టా!!

సిద్ధార్థ్ ‘3BHK’ మూవీ టాక్ ఏంటి…..మూవీ హిట్టా-ఫట్టా!!

0

బాక్స్ ఆఫీస్ మంచి హిట్ కొట్టి చాలా టైం అవుతున్న హీరోల్లో సిద్ధార్థ్(Siddharth) నటించిన లేటెస్ట్ మూవీ 3BHK(3 BHK Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద పర్వాలేదు అనిపించే రేంజ్ లో మెప్పించగా ఒక డీసెంట్ ఎమోషనల్ మూవీగా సినిమా ఉండబోతుందని అంచనా…

తమిళ్ అండ్ తెలుగు లో రిలీజ్ అయిన సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంది అంటే పర్వాలేదు అనిపించే రేంజ్ లో మెప్పించింది అని చెప్పాలి. కథ పాయింట్ కి వస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయిన హీరో అండ్ ఫ్యామిలీలో తండ్రికి సొంత ఇల్లు కట్టుకోవాలి అన్న కళ..

తను సాధించలేని ఇల్లుని తన కొడుకు ఎలాగైనా సాధిస్తాడు అని అనుకుంటాడు…మరి వీళ్ళ ఫ్యామిలీ సొంత ఇంటి కళ నిజం అయిందా లేదా అన్నది అసలు కథ పాయింట్…సింపుల్ స్టోరీ పాయింట్ తో తెరకెక్కిన సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ ని…ఇంటి పరిస్థితులను…

చాలా బాగా చూపించగా కొన్ని చోట్ల కొంచం డ్రాగ్ అయినట్లు అనిపించినా కూడా ఓవరాల్ గా ఒక డీసెంట్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా గా అయితే అనిపించింది అని చెప్పాలి. కానీ కొంచం లెంత్ విషయంలో కొంచం కేర్ తీసుకుని స్క్రీన్ ప్లే కొంచం ఫాస్ట్ గా ఉండి ఉంటే…

సినిమా ఇంకా బాగా మెప్పించేది అని చెప్పొచ్చు..ఉన్నంతలో సిద్ధార్థ్ డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా సెంటిమెంట్ సీన్స్ తో కూడా మెప్పించాడు…శరత్ కుమార్ తన రోల్ వరకు బాగా మెప్పించగా మిగిలిన యాక్టర్స్ అందరూ తమ తమ రోల్స్ లో ఆకట్టుకున్నారు..

సినిమాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా మాత్రం రొటీన్ మూవీస్ మధ్య ఒక డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తూ మిడిల్ క్లాస్ ఆడియన్స్ కి కొంచం కనెక్ట్ అయ్యేలా ఉన్న 3BHK సినిమా ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది….ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్… 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here