బాక్స్ ఆఫీస్ దగ్గర ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ నాలుగో వీకెండ్ లో కూడా ఆడియన్స్ ను అన్ సీజన్ ని తట్టుకుని కూడా థియేటర్స్ కి రప్పిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. కాగా సినిమా నాలుగో వీకెండ్ లో హౌస్ ఫుల్ బోర్డులతో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 115 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళని దక్కించుకుంది..
కాగా సినిమా ఇక మిగిలిన రన్ లో మరో 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూల్ చేస్తే ధనుష్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ తో సంచలన రికార్డ్ ను నమోదు చేయడం ఖాయమని చెప్పాలి. ధనుష్ నటించిన లాస్ట్ ఇయర్ మూవీ…
తిరు చిత్రం బలం సినిమా లాంగ్ రన్ లో 118.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ధనుష్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచి దుమ్ము దుమారం లేపింది. ఇప్పుడు ఆ కలెక్షన్స్ ని అందుకోవడానికి సిద్ధం అవుతున్న సార్ మూవీ…
24 రోజుల్లో 115.66 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా మరో 3 కోట్ల లోపు గ్రాస్ ను వసూల్ చేస్తే టోటల్ గా తిరు చిత్రం బలం సినిమా కలెక్షన్స్ ని అధిగమించి ధనుష్ కెరీర్ లో న్యూ రికార్డ్ ను నమోదు చేయబోతుంది. సినిమా రెండు మూడు రోజుల్లో ఈ రికార్డ్ ను అందుకోవడం ఖాయమని చెప్పాలి.