బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ ఏవి పెద్దగా ఇంప్రెస్ చేయలేదు…ఇక ఓల్డ్ మూవీస్ రీ రిలీజ్ అయ్యి మంచి జోరుని చూపెడుతూ ఉండగా అందాల రాక్షసి(Andala Rakshasi4K) సినిమా ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు డిసాస్టర్ అవ్వగా రీ రిలీజ్ లో మాత్రం సినిమా…
ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని వీకెండ్ లో మాస్ రచ్చ చేసింది. ఇప్పటి వరకు జరిగిన టికెట్ సేల్స్ 52 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా మూడో రోజు సండే ఉండటంతో మరోసారి పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసింది.
ఓవరాల్ గా సినిమా 6.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా టోటల్ గా 58.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను అందుకున్న సినిమా వీకెండ్ లో కలెక్షన్స్ పరంగా మంచి జోరుని చూపించి రీ రిలీజ్ లో సూపర్ సక్సెస్ గా నిలిచింది.
ఫస్ట్ డే 1.05 కోట్ల వసూళ్ళని అందుకున్న సినిమా రెండో రోజున 35 లక్షల రేంజ్ లో వసూళ్ళని అందుకున్న సినిమా మూడో రోజుకి వచ్చేసరికి 16 లక్షల రేంజ్ లో వసూళ్ళని ట్రాక్ చేసిన సెంటర్స్ లో సొంతం చేసుకోగా ఓవరాల్ గా మూడు రోజుల వీకెండ్ లో…
బాక్స్ ఆఫీస్ దగ్గర 1.56 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకుని మంచి జోరుని చూపించింది. ఓవరాల్ గా ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు డిసాస్టర్ అయినా కూడా రీ రిలీజ్ లో మాత్రం ఈ సినిమా ఊహించని రేంజ్ లో సక్సెస్ ను సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు.