Home న్యూస్ ఛావా 3 డేస్ తెలుగు టోటల్ కలెక్షన్స్….బ్లాక్ బస్టర్ బొమ్మ!!

ఛావా 3 డేస్ తెలుగు టోటల్ కలెక్షన్స్….బ్లాక్ బస్టర్ బొమ్మ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీలో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపే విజయాన్ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) సినిమా తెలుగు లో రీసెంట్ గా డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా వీకెండ్ లో రిమార్కబుల్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసింది.

సినిమా రెండో రోజు అనుకున్న అంచనాలను అన్నీ మించి పోయే రేంజ్ లో జోరు చూపించగా…మూడో రోజు కూడా అదే రేంజ్ లో ఓపెన్ అయినా కూడా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఇంపాక్ట్ నైట్ షోలకు గట్టిగానే పడటం కలెక్షన్స్ పరంగా ఇంపాక్ట్ చూపించి అనుకున్న..

రేంజ్ దాకా వెళ్ళ లేకపోయింది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ వలన దెబ్బ పడినప్పటికీ ఓవరాల్ గా మూడో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2.60 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద సినిమా వీకెండ్ లో…

తెలుగు రాష్ట్రాల్లో 9.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని జోరు చూపించడం విశేషం….రెండో రోజు లెవల్ లో కుమ్మేసి ఉంటే సినిమా 10 కోట్ల మార్క్ ని కూడా దాటేసి ఉండేది.. అయినా కూడా వీకెండ్ లో సినిమా అంచనాలను మించి జోరు చూపించిన సినిమా…

4.65 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా…సినిమా 3 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా వీకెండ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 1.65 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా వర్కింగ్ డేస్ లో ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here