ట్రైలర్ మెప్పించిన సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించాలి అన్న రూల్ ఏమి లేదు… లేటెస్ట్ గా చిన్న సినిమానే అయినా కూడా ప్రియదర్శి(Priyadarshi) మరియు నభా నటేష్(Nabha Natesh) ల కాంబినేషన్ లో రూపొందిన డార్లింగ్(Darling Movie 3 Days Collections) సినిమా ట్రైలర్ పరంగా బాగానే ఆకట్టుకోవడం…
అలాగే మేకర్స్ సినిమాను బాగానే ప్రమోట్ చేయడంతో బిజినెస్ భారీగానే జరగగా చిన్న సినిమానే అయినా కూడా 7 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకున్న సినిమా 7.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా మొదటి 2 రోజుల్లో ఏమాత్రం ఇంపాక్ట్ ను…
చూపించ లేక పోయిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో 65 లక్షల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా మూడో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించ లేక పోయింది…
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 20 లక్షల లోపే షేర్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఓవరాల్ గా మూడు రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 85 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా…
1.05 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 2 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా 7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 6.45 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా వర్కింగ్ డేస్ లో కూడా తేరుకునే అవకాశం లేక పోవడంతో డిసాస్టర్ రిజల్ట్ తో పరుగును పూర్తి చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.