బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో ఎపిక్ ఫామ్ తో దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమాతో తన కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రికార్డులు అందుకున్న దసరా సినిమా ఓపెనింగ్స్ ను సాలిడ్ గా టార్గెట్ చేస్తూ మాస్ ఊచకోత కోస్తూ ఉండగా మూడో రోజు కూడా అన్ని చోట్లా…
దసరా సినిమాకి ఏమాత్రం తీసిపోని కలెక్షన్స్ తో రచ్చ చేసింది హిట్3 మూవీ…తెలుగు రాష్ట్రాల్లో దసరా సినిమా 3వ రోజున 6.73 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా హిట్3 మూవీ 5.50 కోట్ల షేర్ ని సాధించింది. దసరా నైజాంలో ఊహకందని హోల్డ్ ని చూపించింది అప్పుడు…
ఇక మూడో రోజు వరల్డ్ వైడ్ గా దసరా సినిమా 9.18 కోట్ల షేర్ ని 16.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక హిట్3 మూవీ మూడో రోజు వరల్డ్ వైడ్ గా 8.55 కోట్ల షేర్ ని 16.10 కోట్ల గ్రాస్ ను అందుకుంది. హిట్3 రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ లో దసరా కి మించిన జోరు చూపించడం కలిసి వచ్చింది.
ఇక టోటల్ గా 3 రోజుల్లో దసరా సినిమా తెలుగు రాష్ట్రాల్లో 26.81 కోట్ల రేంజ్ లో షేర్ ని 45.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుంది. ఇక హిట్3 మూవీ 3 డేస్ కంప్లీట్ అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 24.41 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 42.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది…
ఇక వరల్డ్ వైడ్ గా దసరా సినిమా 38.21 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకోగా 68.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుంది. ఇక హిట్3 మూవీ మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 39.14 కోట్ల షేర్ ని 73 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది…
ఓవరాల్ గా దసరా తెలుగు రాష్ట్రాల్లో లీడ్ ని చూపించగా హిట్3 సినిమా తెలుగు రాష్ట్రాల ఆవల లీడ్ ని చూపించింది…ఇక లాంగ్ రన్ లో హిట్3 మూవీ ఇదే జోరుని కొనసాగిస్తే దసరాని దాటేసి నాని కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని అందుకోవడం కొత్త బెంచ్ మార్క్ ని అందుకోవడం కూడా ఖాయమని చెప్పాలి.